మన చెరువు మళ్లీ కళకళ..
చాలా కాలం తర్వాత మన చెరువు మళ్లీ నీటితో కళకళలాడుతోంది. నిన్నమొన్నటి వరకు చెరువు పూర్తిగా తుంగతో నిండి వాడుకకు పనికిరాకుండా పోయింది. మన ఊరి నీటి కష్టాలు తీరాలంటే చెరువును మళ్లీ బాగు చేసుకోవడం అత్యవసరమని భావించి.. గ్రామస్తులు అందరూ చందాల రూపంలో డబ్బు పోగు చేసి.. తుంగను తీసేసి.. చెరువు పూడిక తీయించారు. తర్వాత అప్పాయకుంట నుంచి నీళ్లు పెట్టడంతో చెరువుకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. రావెళ్ల వేణు, కారుమూడి మురళీ కృష్ణ లు చెరువుకు నీళ్లు పెట్టేందుకు కృషి చేశారు.


                                                                                                                           తేదీ : - 18 - 9 - 2016
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved