వినాయకచవితి సంబరాలు 2013

ఈ సారి కూడా వినాయకచవితి మన ఊరిలో ఘనంగా జరిగింది. ఊరిలో చిన్న పిల్లలు, పెద్దలు అందరు కలసి అన్ని పనులు చేస్తూ సంతోషంగా గడిపారు. పండగ రోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సహంగా పూజా కార్యక్రమాలలో పాల్గొని ఊరిలో వారం రోజుల పాటు పండగ వాతావరణాన్ని నింపారు. నిర్వాహనా బాధ్యతలు వేణు రావెళ్ళ తీసుకొని ప్రతి పనిని దగ్గరుండి చేసారు. అవసరమైనవి అన్ని ప్రణాళికాబద్ధంగా సమకూర్చారు. ఇంకా సందీప్ కారుముడి, సాయి పొడపాటి పంతులు గారికి కావలసినవి అందిస్తూ, బక్తులందరికీ ప్రతి రోజు అన్న ప్రసాదాలని పంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సవ్యంగా జరిగేలా చూసారు.
పూజలు మన జాలయ్య పంతులు గారు చక్కగా జరిపించారు.నిమజ్జనం ముందు రోజు రాత్రి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. పొడపాటి రంగారావు, ఆంజనేయులు (రెడ్డి), మాధవ, కృపారావు తమదైన రీతిలో డాన్సులు వేసి అందరిని అలరించారు.


పండగ సందర్బంగా తీసిన కొన్ని చిత్రాలు ఇప్పుడు మన కోసం.....


Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved