భోగి సంబరాలు 2012


కొన్ని విషయాలు ఒక రోజు గుర్తుంటాయ్. మరి కొన్ని నెల. ఇంకొన్ని సంవత్సరం. కాని కొన్ని విషయాలు మాత్రం జీవితాంతం  గుర్తుంటాయ్. మనకు అలాంటి జీవిత కాలపు జ్ఞాపకం గత ఏడాది భోగి పండుగ. ఏ మాత్రం ప్లాన్ చేయకపోయినా అద్భుతం గా జరిగింది. ఉవ్వెత్తున ఎగసిపడ్డ మంటని చూసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక కుర్రోలంత అక్కడే ఉన్నారు. వెంకట్ బండిలోని పెట్రోల్  తీసి మంట వేయడంతో ప్రారంభమైన వేడుక ట్యాంక్ మీద ఫోటో సెషన్ వరకు కొనసాగింది. మధ్యలో విష్ణు, ఫణి కండువాలతో చేసిన సందడి...వంశీతో ఫణి చేసిన కామెడీ..మంట మీదనుంచి దూకుతూ పండు, వెంకట్, చైతు చేసిన సాహసాలు, జనతో చేసిన కామెడీ......మనం ఎప్పటికి మరువలేని మధుర జ్ఞాపకాలు. చివర్లో పిల్లలందరూ వచ్చి వేడుకకు మరింత వన్నె తెచ్చారు.


Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved