ఇలా శ్రమదానం చేశారు....


ఊర్లో నుంచి పోయే వాళ్లే కానీ వచ్చే వాళ్లు లేరు.
ఒక వైపు నుంచి ఊరు ఖాళీ..
ఊళ్లో చెట్లు కొట్టే వాళ్లే గానీ మొక్కలు నాటే వాళ్లు లేరు..
ఇప్పటికే సగం చెట్లు ఖాళీ..
మొదటి దానికి మన దగ్గర తక్షణ పరిష్కారం లేకపోయినా..
రెండో దానికి మాత్రం ఉంది.
అది మొక్కలు నాటడం.
ఈ విషయాన్ని గుర్తించిన మన సందీప్, సాయి, కార్తీక్ లు శుక్రవారం ఇలా బడి దగ్గర ఇలా ఓ మొక్క నాటారు.
ఊర్లో ఉన్న వాళ్లందరూ కనీసం ఓ మొక్కను నాటి బతికించినా సమస్య చాలా వరకు తీరుతుంది.

ఒక్కటి మాత్రం మనం కచ్చితంగా గుర్తుంచుకోవాలి..
ఈ రోజు మనకు నీడనిస్తున్న ఏ చెట్టును మనం నాటలేదు.
అవి మన ముందు తరం వాళ్ల పుణ్యం.
రేపటి తరానికి నీడనివ్వాల్సిన బాధ్యత మాత్రం కచ్చితంగా మనదే..

- అశోక్ పొడపాటి
     ఫొటో : సాయి, సందీప్ 
తేది : 30-8-2014
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved