గంగమ్మ ఒడికి గణనాథుడు

వినాయక నిమజ్జన వేడుకలు మనగ్రామంలో కోలాహలంగా ముగిశాయి. గురువారం రాత్రి(4వ తేదీ) డప్పుల మోత మధ్య మొదలైన కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. కారుమూడి అశోక్ ఆధ్వర్యంలో సాగిన వినాయకుని లడ్డూ వేలం సరదాగా ముగిసింది. ముక్తినూతలపాడుకు చెందిన ముళ్లూరి సుబ్బారావు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. దీనికి ముందు ఆలయంలోని మండపంలో  పూజ, అనంతరం పెద్ద ఎత్తున ప్రసాదం పంపిణీ చేశారు. బాణసంచా వెలుగులు, డప్పు చప్పుళ్లు, యువకుల నృత్యాలు, కేరింతలు మధ్య ఊరేగింపు సాగింది. నల్లూరి రంగయ్య నృత్యం ప్రత్యేక ఆకర్షణ.  మరసటి రోజు ఉదయాన్నే వసంతోత్సవాల మధ్య గణనాథుడ్నిగ్రామ సమీపంలోని  అప్పాయగుంటకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.  అప్పాయగుంటలో నిమజ్జనం ఇది తొలిసారి.  అక్కడ స్నానాలు, భోజనాల అనంతరం అందరూ ఇంటిబాట పట్టారు.  మొత్తంగా వినాయక చవితిని నిర్విఘ్నంగా కొనసాగించి,  విజయవంతంగా ముగించిన వారందరికీ మనగుడిమెళ్లపాడు.కామ్ తరఫున శుభాభినందనలు.

- అశోక్ పొడపాటి
ఫోటోలు:- సాయి పొడపాటి, సందీప్ కారుమూడి
తేదీ :- 13-9-2014


Share this article :

+ comments + 1 comments

September 13, 2014 at 9:53 PM

appayagumta nimarjanam maruvalenidi chala enjoy chesamu

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved