గుడిమెళ్లపాడులో కొలువుతీరిన గణనాథుడు
వినాయక చవితి వేడుకలు మనూర్లోనూ అట్టహాసంగా మొదలయ్యాయి. రామాలయంలో ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం మధ్యాహ్న సమయాన  విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారు. వరప్రసాద్ పంతులు ప్రత్యేక పూజలు చేశారు. పొడపాటి వారికి శోదకం ముగిశాక(3వ తేదీ రాత్రి ఊరేగింపు, 4వ తేదీ ఉదయం నిమజ్జనం) నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. వేణు రావెళ్ల, మురళీకృష్ణ కారుమూడి, సందీప్ కారుమూడి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. శనివారం జన్మదినం సందర్భంగా కారుముడి శ్రీకాంత్ ప్రత్యేక పూజలు చేశాడు.

తేది: 30-8-2014
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved