అమ్మను మించి దైవమున్నదా..

 తల్లి ఒక వైపు..దేవతలంతా ఒక వైపు..
సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు...


స్వర్గం ఎక్కడ ఉంటుందంటే..
అమ్మ పాదాల చెంత.

దేవుడు అన్నిచోట్ల ఉండలేకే..
అమ్మను సృష్టించాడు.

ప్రేమకు నిర్వచనం కావాలంటే చూడాల్సింది నిఘంటువును కాదు.. 
అమ్మ ముఖాన్ని.

కణకణ లాడే ఎండకు శిరస్సు మాడినా...
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ.
చారెడు నీల్లైన తానూ దాచుకోక..
జగతికి సరస్వం అర్పించే మబ్బే అమ్మ.


అమ్మ ఔన్నత్యాని వివరించే కొన్నికవితా పంక్తులు ఇవి..

అయినా అమ్మను పూజించడానికి. ప్రేమించడానికి, గౌరవించడానికి ఒక రోజు సరిపోతుందా..?. దాంతో బాధ్యత తీరిపోతుందా..?

పురిటి నొప్పుల బాధను, ప్రానమొక ఎత్తుగా పెంచిన ప్రేమను తూచే రాళ్ళు మన దగ్గర లేవు. 

అమ్మంటే ఎప్పటికి తీర్చుకోలేని ఋణం. ఇలపై దైవం.

గుడిమెళ్లపాడు గడ్డ మీద బిడ్డను కన్న తల్లులందర్నీ ఈ సందర్భంగా ఒక్కసారి తల్చుకుంటూ..

                                     అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.
                                                                                                                                      - అశోక్ పొడపాటి
                                                                                                                                           12-5-2013
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved