కన్నులపండువగా కోదండరాముని కళ్యాణం


శ్రీరామనవమి పర్వదినాన్ని(ఏప్రిల్ 19) మనూరి కోదండరాముని కోవెలలో కన్నుల పండువగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం ఆలయ పూజారి వరప్రసాద్ ఆధ్వర్యంలో కమనీయంగా సాగింది. ఈ ఏడాది పీటలపై పొడపాటి రాజేష్, స్మిత దంపతులు కూర్చున్నారు. రాత్రి ఊరేగింపు కూడా ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అధికశాతం గ్రామస్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. ఏదిఏమైనా అనివార్య కారణాలతో కొన్నేళ్లుగా ఆలయంలో కల్యాణం జరగడం లేదు. ఈ ఏడు ఇలా అట్టహాసంగా జరగడం ఆనందదాయకం. ప్రతిఏడూ ఇలాగే కల్యాణం కన్నులపండువగా కొనసాగాలని కోరుకుంటూ, ఆ శక్తిని ప్రసాదించాలంటూ ఆ కోదండరాముడి ప్రార్థిస్తూ..
                                                                                                                                          -  అశోక్ పొడపాటి
                                                                                                                                               13-5-2013
(ఏదిఏమైనా ఫొటోలు అప్ లోడ్ చేయడంలో బాగా ఆలస్యం జరిగిపోయింది. ఇక ముందు ఇలా జరగకుండా చూడడానికి ప్రయత్నిస్తాం. ఫొటోలు తీసిన పొడపాటి సత్యనారాయణ(సాయి), పంపించిన ఫణికి ధన్యవాదాలు.)













Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved