మళ్లీ ఎప్పుడు మామ గారు ...మరణం తలుపు తట్టినప్పుడు..  
జీవితం నుంచి చిరునవ్వుతో వీడ్కోలు తీసుకోవాలి.
పరిపూర్ణ జీవితం అంటే ఇదే.

జీవితం గురించి ఓ తత్వవేత్త పలుకులివి. చిరునవ్వుతో జీవితానికి వీడ్కోలు పలకడం అనే అదృష్టం అందరికీ దక్కదు. ముఖ్యంగా బాధ్యతలు భుజాల మీద ఉన్నప్పుడు, బంధాలు బలంగా ఉన్నప్పుడు ...

ఈ వెబ్ సైట్ మొదలు పెట్టాక ఇది మొదటి నివాళి వ్యాసం. రాయాల్సిరావడం దురదృష్టం. కానీ రాయకపోవడం నేరం. ఈ నాలుగైదేళ్లలో చాలా మంది మన మధ్య నుంచి వెళ్లిపోయారు. కొందరు అర్థంతరంగా.. కొందరు అన్నీ చూశాక. ఈ మధ్య కాలంలో అర్థాంతరంగా ఆగిన గుండెలే ఎక్కువ. కారణాలు ఏవైనా.. మిగిలినవి మాత్రం కన్నీళ్లే.. 
నిన్న మొన్నటి వరకు మధ్య ఉన్న వాళ్లు కొన్ని గంటల వ్యవధిలో గుప్పెడు బూడిదగా, గోడ మీద ఫొటోగా మిగిలిపోవడం భరించలేని విషాదం.


పోయినోళ్లందరూ మంచోళ్లు అంటారు.. 
కానీ మంచోళ్లూ పోతారు. 
అలాంటి ఓ మంచోడు.. గన్ అని కుర్రాళ్లు.. 
కొత్తింటి శీను.. అని తోటివాళ్లు పిల్చుకునే కారుమూడి శ్రీనివాసరావు..  

ఎందుకు మంచోడంటే ..

పరీక్షలు ఫెయిలైనప్పుడు, మరేదైనా పొరపాటు చేసినప్పుడు ఎవరైనా భయపడేది.. ఇంట్లో తెలిస్తే ఏమంటారో అని.. అయితే మనూర్లో చాలా మంది కుర్రాళ్లకు ఉండే ఎక్స్ ట్రా భయం గన్ ఏమంటాడో అని.. ఎక్కడ ఎదురై క్లాసులు పీకుతాడో అని..

చదువు పూర్తయి హైదరాబాద్ లో ఉండే కుర్రాళ్లది ఓ భయం.. సంక్రాంతికి ఊరెళ్తే జాబ్ గురించి గన్ ఏమంటాడో అని.. ఇంట్లో వాళ్లను ఎలాగో కన్విన్స్ చేయచ్చు.. కానీ ఈయన్ను ఎలా..

కానీ మామ.. ఇప్పటికే చాలా మందికి జాబులొచ్చాయి.. రానివారికీ రేపోమాపో వస్తాయి. ఆ జాబ్ వచ్చిన మరుక్షణం ఇంట్లో వాళ్లకు చెప్పాలనిపిస్తుంది. ఇంకా ఎవరికి చెబుదాం అని ఆలోచిస్తే.. నువ్వు గుర్తొస్తావ్ .. ఎందుకంటే మంచో చెడో వాళ్ల గురించి ఆలోచించింది నువ్వే.. 
“ అప్పుడేదో అన్నావ్ ” అని నీ ముందుకొచ్చి కాలర్ ఎగరేద్దామంటే  నువ్వు లేవు.. 
నీ కోపం వెనకున్న ఇష్టం అందరికీ తెలుసు 

వినాయక చవితి అందరికీ పండగే.. కానీ మనూర్లో ఇంకా పందిరి వేయలేదని నువ్వు బాధపడ్డావ్..

గుడి అందరికీ గుడే.. కానీ పండగ పూట ఆర్చి మీద దేవుడి విగ్రహాలకు దండలు లేవని నువ్వు ఆలోచించావ్..

రోడ్డు అందరికీ రోడ్డే.. కానీ  శుభ్రం చేసే బాధ్యత నువ్వు తీసుకున్నావ్..

నాలుగేళ్ల నుంచి సంక్రాంతి వేడుకలు చేసి.. సడన్ గా ఆపినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ నువ్వు అడిగావ్.. డబ్బులు లేవా అని..

ఒక ఏడు ఎన్టీఆర్ వర్థంతి చేయకపోతే కంగారు పడ్డావ్..

అలా ఖాళీగా కూర్చుని పోసుకోలు కబుర్లు చెప్పుకోకపోతే.. ఆ చెరువు చూట్టూరో, బడి దగ్గరో నాలుగు చెట్లు నాటొచ్చు కదా.. అని మందలించావ్..

పార్టీ జెండా విరిగినా, చెరువు ఎండినా, ముక్తినూతల పాడు నుంచి వచ్చే రోడ్డు గుంతలతో నిండినా నువ్వు బాధ్యత తీసుకున్నావ్..

అందరి మంచి కోరుతూ చాలా మందికి స్నేహితుడివయ్యావ్.. కొందరికి శత్రువు అయ్యావ్..
ఎవరి ఫ్యామిలీని వారు చూసుకుంటే చాలు.. బతుకు తెల్లారిపోతుంది అనే రోజుల్లో కూడా  నువ్వు చాలా మంది గురించి ఆలోచించావ్, ఊరి గురించి కంగారుపడ్డావ్.. గ్రేట్ మామ.. రియల్లీ గ్రేట్..

నువ్వు లేకపోవడం చాలా కుటుంబాలకు లోటు అని తెలిసి కూడా నిర్దాక్ష్యణ్యంగా వదిలేసి వెళ్లిపోయావ్ కదా మామ..
మన ఊళ్లో.. నువ్వు పూజించిన ఇంత మంది దేవుళ్లలో ఏ ఒక్కరూ నీ ఊపిరి ఆగకుండా చూడకపోవడం.. వాళ్ల చేతగానితనం.. ఊరి దురదృష్టం..

ఒక మనిషి ఎంత గొప్పగా బతికాడో అతని చావు చెబుతుంది అంటారు. నీ చావు వార్త విని పొంగిన కన్నీళ్లు, క్షణ కాలం ఆగి కొట్టుకున్న గుండెలు, నీ ఆలోచన్లతో ఘనీభవించిన క్షణాల లెక్కే ప్రామాణికమైతే.. నీ కన్నా గొప్పగా బతికిన వాళ్లు దాదాపు ఎవ్వరూ లేరు..

ఈ రోజు నువ్వు లేవు.. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం మేమున్నంత వరకు ఉంటాయ్..

ఈ రోజు అస్తమించినా, 
మరో రూపంలో ఉదయించే నీకోసం ఎదురు చూస్తుంటాం మామ గారు.. సెలవ్..

కారమూడి శ్రీనివాసరావు దృశ్య మాలిక..అశోక్ పొడపాటి

తేదీ : - 19- 2- 2017


(ఆయన్తో మీకున్న ఆనుబంధాన్ని వీలైతే కామెంట్ల రూపంలో తెలియజేయండి.. మరో ఆర్టికల్ అయినా పర్లేదు, రాసి పోస్ట్ చేయండి.. ఫొటోలున్నా మనవాళ్లతో పంచుకోండి.. థ్యాంక్యూ)

Share this article :

+ comments + 6 comments

February 19, 2017 at 5:47 PM

He is one of the person in our village who used to talk with me very very..very affectionately....

February 19, 2017 at 5:54 PM

I have a special bond with Seenu annayya since childhood, he used to treat me like Princess, always used to ask me about my education and well-being. Once I left the village also when ever I met him used to check the opportunities for the kids too. I really feel we should educate the people about health too without neglecting as life is so precious. We will miss you Seenu annayya.

February 19, 2017 at 6:19 PM

Really u r the one who always think about our village and everyone,u r the one when i came to village talk to me about education about life every time and gives me many suggestions,we all miss u babai truly and heartfully..RIP..

February 19, 2017 at 10:39 PM

pedda bajaruki vaste nuvvu kanipinchavu ante chala badha ga undi mama.
uriki vachina prathi sari, ma uriki vachav enti ani saradaga adige vallu evvaru mama.. miss you mama. hope you soul rest in peace.

March 9, 2017 at 12:15 PM

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai

April 17, 2018 at 4:15 PM

Good afternoon
its a nice information blog
The one and only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved