మళ్లీ మనకు కన్నీటి కష్టాలు తప్పవా?


ఇది ప్రస్తుతం మన చెరువు పరిస్థితి. 
నీళ్లు అడుగంటి కింద మట్టి కనిపిస్తున్న దుస్థితి.
మన ఊరికి ప్రధాన నీటి వనరు చెరువు ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. నీళ్లు ఇప్పటికే అడుగంటాయి. వర్షాలు కురవకపోతే ఒకటి రెండు నెలల్లోనే పూర్తిగా ఎండిపోతుంది. ఊర్లో పేరుకు వాటర్ ట్యాంక్ ఉన్నా.. ఐదు రోజులకు ఒకసారి వస్తున్న నీటితో పనులు గడవటం కష్టం. గతంలోలా అప్పాయగుంటకు సైకిళ్లపై వెళ్లి నీళ్లు తెచ్చుకునే ఓపిక ప్రస్తుతం ఎవరికీ లేదు. త్వరలోనే వర్షాలు పడి మళ్లీ చెరువు కళకళలాడాలని కోరుకుందాం.

ఫొటో కర్టెసీ: సాయి పొడపాటి
తేదీ:- 12-7-2014
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved