కోలాహలంగా కోదండరాముడి కల్యాణం

మన గ్రామ రామాలయంలో వేంచేసిన శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి కల్యాణోత్సవం... చైత్ర శుద్ధ నవమి నాడు కన్నుల పండువగా, అత్యంత కోలాహలంగా సాగింది. కారుమూడి మురళీకృష్ణ, శరణ్య దంపతులు పీఠల మీద కూర్చున్నారు. వరప్రసాద్ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. గ్రామస్తులందరూ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కల్యాణ వేడుక దాదాపు రెండు గంటల పాటు సాగింది. తర్వాత పానకం, వడపప్పు పంపిణీ చేసి.. అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక రాత్రి 11 గంటలకు ఉత్సవ మూర్తులను సిద్ధం చేశారు. తర్వాత మొదలైన ఊరేగింపు మూడు గంటల వరకు సాగింది. డప్పుల మోతలు, నృత్యాలతో కోలాహలంగా ముగిసింది. వీధుల్లోకి వచ్చిన ఉత్సవ మూర్తికి గ్రామస్తులందరూ హారతులిచ్చి, టెంకాయలు కొట్టారు.  పొడపాటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ఏడు ఆలయానికి స్వల్ప మరమ్మత్తులు చేశారు. ఫ్లోరింగ్ లాగించారు. కల్యాణోత్సవానికి అందరూ ఎవరికి తోచినంత వారు చందాలు కూడా ఇచ్చారు. మొత్తంగా శ్రీరామనవమి నాడు పూజలు, అన్నదానాలు, ఊరేగింపులు, చిందులు, నవ్వులు, కేరింతలతో గుడిమెళ్లపాడు మరింతగా శోభిల్లింది.


- అశోక్ పొడపాటి
  తేదీ:- 10-4-2014

  ఫొటోలు: సత్యనారాయణ(సాయి) పొడపాటి




















Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved