మీ బాటలో నడుస్తూ..సదా మిము స్మరిస్తూ..


ప్రపంచ చరిత్ర రెండు భాగాలు.. క్రీస్తు ముందు.. క్రీస్తు తర్వాత..
అలాగే తెలుగు జాతి చరిత్రను రెండు భాగాలు చేస్తే..
ఎన్టీఆర్ ముందు.. ఎన్టీఆర్ తర్వాత.
ఎన్టీఆర్ కు ముందు... తర్వాత తెలుగునాట గొప్పవాళ్లున్నా..
ఆయన ప్రస్థానం ప్రత్యేకం.. ప్రతిభ బహుముఖం.
అందుకే జాతి యావత్తు ఆయన్ను 'అన్న' అని గౌరవించింది.
కదలిరండని పిలుపునిస్తే కదం తొక్కింది.

తెలగువాడికి ఉనికినీ..
జాతికి ఆత్మగౌరవాన్నీ..
సినీ పరిశ్రమకు ఖ్యాతినీ.. 
రాజకీయాలకు నీతినీ..
అందించిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, రాజకీయ ధురంధరుడు అన్న నందమూరి తారక రాముడి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుడ్ని మరొక్క సారి స్మరించుకోవడం మన బాధ్యత. ఇతరుల మాటెలా ఉన్నా పార్టీలకు, వర్గాలకు అతీతంగా మనం మాత్రం అన్నగారిని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. వర్ధంతిని ప్రతి ఏటా ఘనంగానే నిర్వహిస్తూనే ఉన్నాం. ఊరు చిన్నదైనా.. అభిమానం చిన్నది కాదని చాటుతూనే ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగాలని అన్నగారి జయంతి వేళ మరొక్కసారి సంకల్పం చెప్పుకుందాం. పరిస్థితులు అనుకూలిస్తే.. అందరూ కోరుకుంటున్నట్టు ఊరిలో విగ్రహం ఏర్పాటు చేసుకుందాం.
అందాకా..

ఆయన చూసిన బాటలో నడుస్తూ..
చేసిన సేవలను స్మరిస్తూ..
ఆయన కలల్ని సాకారం చేస్తూ...   మనగుడిమెళ్లపాడు.కామ్

                                                                                                                                             అశోక్ పొడపాటి
                                                                                                                                         తేదీ: 28-05-2013
Share this article :

+ comments + 3 comments

May 28, 2013 at 11:24 AM

Eppatiki Mee adugu jadallo nadusthu...anna gaariki janmadina subakankshalu teliyachesthu ,sada smurinchu kuntu...

May 29, 2013 at 6:28 AM

Nice atricle Ashok.....venkataranam bodapati

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved