గుడిమెళ్ళపాడు లో జడివాన

మన చిన్న ఊరికి పెద్ద కష్టం వచ్చింది. నీలం తుఫాను ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊరంతా జలమయమైంది. వాగు పెద్ద ఎత్తున పొంగింది. కొత్తగా  కట్టిన బ్రిడ్జి పైనుంచి నీళ్ళు పారుతున్నాయి. ముక్తినుతలపాడు, మనూరికి మధ్య ఉన్న రోడ్డు వరద తాకిడికి  పూర్తిగా కోసుకు పోయింది. ఈ రోడ్డును ఈ మధ్యే వేశారు. ఊరి నుంచి రాకపోకలు పుర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఊరు పూర్తిగా జలదిగ్బందంలో ఉంది. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved