నీటి కరువు.. గుండె 'చెరువు'

(మన ఊళ్లో నీటి కరువు.. చెరువు దీనస్థితి గురించి మన సాయి స్పందన ఇది. 
ఊర్లోని సమస్యల మీద పిల్లలు స్పందించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 
ఊర్లోని డైలీ లైఫ్, సమస్యలు, తోచిన పరిష్కారాలను మనవాళ్లతో పంచుకోవాలని అందరికీ మరొక్కసారి ఇదే ఆహ్వానం.. ఊర్లో ఉండే వాళ్లకు మత్రమే ఈ అకాశం ఉంది.
 మీ ఆలోచనలను కామెంట్ల రూపంలో పోస్ట్ చేసి.. కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ..)



నీళ్లు వచ్చేది.. ఇక వారానికి ఒకసారే..

మన ఊరికి గుండ్లకమ్మ జలాశయం నుంచి నీరు వస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇప్పటి దాకా రెండు రోజులకు ఒకసారి వచ్చేవి. ఇక నుంచి మాత్రం నాలుగురోజులకి ఒకసారి వస్తాయంట. కుటుంబ అవసరాలకి ఆ నీరు సరిపోదు... ఇక పశుసంపద వాళ్ళకి అసలు సరిపోదు. ఇప్పుడు గుర్తొస్తుంది మన గ్రామ ప్రజలకి... మనకి ఒక చెరువు ఉంది. అందులో ఉన్న నీరు మన అవసరాలకు ఉపయోగపడుతుంది అని. కానీ ఇప్పుడు అందులో నీరు తప్పితే అన్నీ ఉన్నాయి. వీడికి ఇప్పుడు గుర్తొచ్చిందా ఏంట్రా అనుకొంటున్నారా. 
        ఆదివారం కాలేజీ లేదు కదా కొంచెం లేట్ గా లెగుద్దామ్ లే అనుకొంటుంటే అంతలోకి వచ్చి లేపాడు మా అయ్య. రెండు కావిళ్ల నీళ్ళు తీసుకురా నేను పొలం వెళ్తున్నా అన్నాడు. రెండు కావిళ్లే కదా అని సైకల్ కి బుంగలు వేసుకొని వెల్లా. అక్కడికి వెళ్తే ఆ రెండు బుంగలు ఎక్కడ మునుగుతాయో మాత్రం అర్ధం కాలేదు. అందరూ ఒక చోట ముంచుతుంటే అక్కడికి వెళ్లా. బురదే కదా ఏం అవుతుంది లే అని దిగాను. పోయే కొంది నేను బురదలో ఇరక్కపోతున్నానే కానీ బుంగ మాత్రం మునగట్ల. అలా కొంచం దూరం వెళ్ళినాక ఒకచోట బుంగలు మునిగాయి. కానీ అక్కడ నుంచి నేను రావడమే కష్టంగా ఉంది. ఇంక బుంగలను ఎలా తీసుకు రావాలో అర్థం కాలా. సరే అంత కష్టపడి తెచ్చిన ఆ నీరు మురికిగానే ఉన్నాయి. చూస్తే ఏముంది.. అనుభవిస్తే తెలుస్తుంది అంటారు. రోజూ కాలేజీ కి వెళ్ళేటప్పుడు.. వచ్చేటప్పుడు చూస్తే తెలిసింది వేరు.. దిగితే తెలిసింది వేరు. ఇప్పుడు వేసవి కాలం వస్తుంది.. ఇప్పుడు అన్నా మనం చెరువు ని బాగు చేసుకోగలిగితే కనీసం రాబోయే రెండు, మూడు సంవత్సరముల కి మన చెరువు మనకి ఉపయోగపడుతుంది.

మన చేత గాని తనమో ఎంటో తెలియదు కానీ..

మనం మన ఊరికి రోడ్లు వేయించుకోలేక పోయినందుకు సిగ్గు పడాలి. మొన్న శివరాత్రి రోజు నేను మా స్నేహితులతో అద్దంకి మండలం లో ఉన్న మనికేశ్వరం గుడికి వెళ్దాం అని బయలు దేరాము. మధ్యలో దారి తప్పి ఒక ఊరికి వెళ్ళాం. అది ఒక పల్లెటూరు. ఎంత అంటే మన ఊరు పది సంవత్సరముల క్రితం ఎలా ఉండేదో అలా ఉంది. ఆ ఊర్లో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డే. ఊరికి వెళ్ళే మార్గం తారు రోడ్డు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే  ఆ ఊర్లో అంతా పెంకుటిల్లు. ఎక్కడో ఒకచోట బిల్డింగ్ లు ఉన్నా అవి ఏవో పాతకాలంలో కట్టి ఇంకా పూతపని కూడా చెయ్యలేదు. మన ఊరికి రోడ్ కన్నా అతి ముఖ్క్యమైన పని ఇంకొకటి ఉంది. 
     ముక్తినూతలపాడు నుంచి మన ఊరికి వచ్చే రోడ్డు. అది మనకి అతి ఉపయోగకరమైన మార్గం. ఆ దారిలో నడవడమ్ కంటే ఏదన్నా వాహనం వచ్చిద్దేమో.. లేట్ అయిన అది ఎక్కిపోడం మేలు అని అనుకొంటారు అందరూ. ముఖ్యంగా నేను అనుకుంటా. ఎంధుకంటే ఆ రోడ్ లో కొంతమంది ప్రజలు మలమూత్ర విసర్జన చేస్తారు. ముందు ఆ సమస్యను తొలగించుకొని రోడ్ గురించి ఆలోచించాలి. మన ఇంటి ముందు ఎవరైన అలా చేస్తే రెండో సారి చేయకుండా చేస్తాం. మన ఊరి ముందు అలా చేస్తే మాత్రం మంకెందుకు అని వదిలివేస్తాం. ఇన్ని చెప్పేవాడివి నువ్వే ఊర్లో వాళ్ళతో చర్చించి మన ఊరికి ఉన్న సమస్యలను తొలగించవచ్చు కదా అని అనుకొనవచ్చు. ఆదివారం పూట బజార్లో కూర్చోంటే వీడికి ఇక్కడ ఏం పని అనుకొనే వాళ్ళు చాలా మంది. ఎలక్షన్ టైమ్ లో మనం మన పార్టీ ని ఎంత కష్టపడి గెలిపించు కొన్నామో అందరికీ తెలుసు. అంత కష్టపడటం వల్ల మనకి ఉపయోగం ఉందా లేదా ! ఈ సారి కూడా మనం అదే పార్టీ ని గెలిపించుకోవాలా!!


- సాయి పొడపాటి
తేదీ : - 20 - 3- 2016
Share this article :

+ comments + 3 comments

Anonymous
March 20, 2016 at 11:04 AM

edo okati cheddam ra babu

March 20, 2016 at 11:09 AM

నలుగురుతో నారాయణ
ఎవరికి వారె యమునా తీరే

March 20, 2016 at 11:11 AM

నలుగురుతో నారాయణ
ఎవరికి వారె యమునా తీరే

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved