మన వేప చెట్టు... ఊరి ఆయు పట్టు

ఒక మంచి నీస్తం ఇది....
             ఊరిలో ఎన్ని చెట్లు వున్నా వేప చెట్టు అనగానే గుర్తు వచ్చేది మాత్రం చెరువు దగ్గర ఏళ్ళ తరబడి నుండి వున్నా మన వేప చెట్టు మాత్రమే. ఇది చెట్టు మాత్రమే నా ... కాదు. ఏదో ఒక సమయం లో ప్రతి ఒక్కరిని ఈ చెట్టు ఆదుకున్నదే. దీని నీడన సేద తీరని వారుండరు అని అనడంలో అతిశయోక్తి లేదు. 

ఇప్పుడంటే కాలం మారింది కాని, నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరం ఈ చెట్టు మీద కోతి కొమ్మచ్చి ఆడినవాల్లమే. నాకు బాగా గుర్తుంది ఈ చెట్టు మిగిల్చిన తియ్యని జ్ఞాపకాలు ఎన్నో అవి అనుబవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. 
మన వేప చెట్టు మన జెండా మధ్య స్థలంలో ఆడిన ఆటలు ఎన్నో. 
ఇక్కడే చెట్టు మీద కోతికోమ్మచి, చెట్టు కింద కర్రా బిళ్ళా, కలర్స్ కలర్స్, కరెంటు షాక్, చిన్నపుడు అమ్మాయిలు అబ్బాయిలు కలసి అష్టా చమ్మా. ఇంకా మంచి కిక్ ఇచ్చే గేమ్ పిచ్చాబంతి అది లబ్బరు బాల్ తో... 
పండగ (సంక్రాంతి) నెలలో ఈ చెట్టు బెరడు చెక్కి మరి బంఖ ని తీసుకొని గాలి పటాలు అతికించడానికి వుపయోగించేవాళ్ళం. 
 Vepa chettu
తర్వాత ఈ చెట్టు కింద గేదలు ని కూడా కట్టేవారు, ఇలా యెన్నో విధాలుగా ఈ బంగారం మన అందరికి సరిపడా జ్ఞాపకాలును మిగులుస్తూ తను మాత్రం ఒంటరిగా ఒరిగిపోతుంది. 
ఇది కేవలం చెట్టు మాత్రామే కాదు మన ఊరికే మకుటం లా కనిపిస్తూ వుంటుంది.
 ఇప్పుడు నేను వృత్తి రీత్యా ఊరిలోనే ఉంటున్నా కదా  చూస్తూ వుంటే ఎన్నో జ్ఞాపకాలు . 


Share this article :

+ comments + 6 comments

December 10, 2015 at 10:41 PM

Nice bvndi raaa....chakkagaaa...mnchigaa bgaa cheppinav...old memories...

December 10, 2015 at 10:41 PM

Nice bvndi raaa....chakkagaaa...mnchigaa bgaa cheppinav...old memories...

December 10, 2015 at 11:11 PM

thanks mama...

December 10, 2015 at 11:23 PM

Good one Ps.. Keep writing..

March 13, 2016 at 3:28 PM

bagha chepparu, keep it up

January 18, 2017 at 12:19 AM

These all sweet memory's what ever I had I never forgot in my life thanks to every one

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved