మనకీ కావాలొక "శ్రీమంతుడు"


ఊరిని దత్తత తీసుకోవడం.. అనే కాన్సెప్ట్ తో ఇటీవల విడుదలైన శ్రీమంతుడు సినిమాను అందరూ చూసే ఉంటారు. కనీస వసతులు కూడా ఒక ఊరిని ఒక శ్రీమంతుడైన కుర్రాడు దత్తత తీసుకుని ఎలా వృద్ధిలోకి తెచ్చాడు అనేది చిత్ర కథాంశం. బాగా సంపాదించి స్థిరపడిన వారు, విదేశాల్లో ఉన్న వారు.. వాళ్లకి సంబంధించిన ఊర్లని దత్తత తీసుకున్నారు.. అనే వార్తల్ని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. దత్తత అనే మాట లేకపోయినా.. మంచి ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారు ఊరికి అవసరమైన పనులు, సేవా కార్యక్రమాలు చేయడం, పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహించడం, ఊర్లోని వాళ్ల కోసం మెడికల్ క్యాంప్ లు ఆర్గనైజ్ చేస్తుండటం తరచుగా పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ సినిమాతో దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ అందరికీ బాగా రీచ్ అయింది. సహజంగానే కొంత డిస్కషన్ స్టార్ట్ అయ్యింది.

ఆ సినిమాలోని దేవరకోట గ్రామం స్థాయిలో కాకపోయినా మన సమస్యలు మనకున్నాయ్.. చెరువు ఎండిపోవడం, రెండు రోజులకు ఒకసారి నీటి సమస్య, ముక్తినూతలపాడు నుంచి మనూరు వచ్చే రోడ్డు బాగోలేకపోవడం..లైట్లు కూడా వేయకపోవడం, శ్మశానానికి దారి సరిగ్గా లేకపోవడం, నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి ఓ చోటంటూ లేకపోవడం, కనీసం ఓ చిన్న రీడింగ్ రూమ్ లాంటిదాన్ని ఏర్పరచుకోలేకపోవడం ఇలాంటి వన్నీ. కొన్ని కోరికలున్నాయ్.. ఆంజనేయ స్వామి, ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్ఠించాలని, మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి ఉండాలని, చిన్న ప్లే గ్రౌండ్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలని, ఖాళీ స్థలంలో ఓ చిన్న పార్క్ ను డెవలప్ చేస్తే బావుంటుందని, చెరువు చుట్టూ మొక్కలు నాటాలని, ఊళ్లో ఎక్కువగా ఉన్న ముసలివాళ్ల కోసం ఓ డాక్టర్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, బడిని బాగు చేసుకోవాలని, ఊరికి సంబంధించిన ఫొటోలు, ఇతర డేటా సేవ్ చేయడానికి ఓ హార్డ్ డిస్క్.. మొదలైనవన్నీ. వీటిలో కోట్ల రూపాయలు ఖర్చయ్యే పనులేవీ లేవు. ఓ లక్షతో పూర్తయ్యేవీ చాలా ఉన్నాయ్. పైసా పెట్టుబడి లేకుండా కొంచెం శ్రీమదానం చేసినా చాలా సమస్యలు తీరతాయ్.

నీ దగ్గర డబ్బుంది కాబట్టి నువ్వు దత్తత తీసుకో అని ఒకడి నెత్తిన రుద్దడం కరెక్ట్ కాదు.. నీ శాలరీ ఇంత కాబట్టి నువ్వు ఇంత ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడం పద్ధతి కాదు... నా శాలరీ తక్కువ.. నన్ను ఇన్వాల్స్ చేయకండి అనడమూ మర్యాద కాదు. నాకు ఉద్యోగం లేదు కాబట్టి నాకేం సంబంధం లేదు అనడమూ సంస్కారం కాదు. ఊరి నుంచి వెళ్లిపోయాం.. మాకేంపని అనడమూ వివేకం కాదు. మనూరికి సంబంధించి వివిధ ఉద్యోగాల్లో ఉన్న వారి శాలరీలన్నీ కలిపితే నెలకు మినిమమ్ ఓ పదిలక్షలుంటుంది. దీన్లోంచి ఎట్ లీస్ట్ ఓ వెయ్యి రూపాయలు ఊరి కోసం డొనేట్ చేయలేమా..? అంటే మనం సంపాదించే వంద రూపాయల్లో ఓ రూపాయి. ఊరి పేరు మీద ఓ ఎకౌంట్ ఓపెన్ చేసి సేవ్ చేయడం మొదలు పెడితే అద్భుతాలు చేయలేకపోయినా అవసరాలు తీర్చుకోవచ్చు. చిన్నచిన్న సమస్యలు కొన్నైనా పరిష్కరించుకోవొచ్చు. ముందు లీడ్ తీసుకునేవాళ్లుంటే ఫాలో అవ్వడానికి, సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారని నా అభిప్రాయం.

నిష్ఠూరంగా ఉన్నా కొన్ని నిజాలు మాట్లాడుకుంటే.. మనలో చాలా మంది విదేశాల్లో, ఇక్కడి సిటీల్లో జాబ్ లు చేస్తున్నారు. వీళ్లలో తొంభై శాతం మంది సిటీల్లోనే సెటిల్ అవుతారు. అమ్మాబాబులు అక్కడ ఉన్నంత వరకే ఎవరికైనా ఊరితో సంబంధం.. తర్వాత ఊరెక్కడో.. మనమెక్కడో.. అంటే అందరం సగటున ఓ పదేళ్లు అప్పుడప్పుడు కలుస్తుంటామేమో. ప్రతి వాళ్లు వాళ్లకు క్లోజ్ గా ఉండే ఒకరిద్దరితో టచ్ లో ఉండొచ్చుగానీ.. మొత్తంగా అందరికీ అందరూ దూరమవుతారు (ఇప్పటికే అయ్యారు.. దాని గురించి మరోసారి డీటైల్డ్ గా మాట్లాడుకుందాం). ఇగోలు, జెలసీలు కొంచెం ఎక్కువ పాళ్లల్లో ఉండే మనం ఊరి బయట కలవడం ఇంపాజిబుల్. దాయాదులు, మామలు, అల్లుళ్లు లాంటి చాలా వరసలు ఊళ్లో మనల్ని తప్పనిసరిగా కలిపి ఉంచుతాయ్. ఊరి నుంచి బయటకు వచ్చార ఆ బాదరబందీ ఏమీ ఉండదు. ఇక్కడ తప్పు ఎవ్వరిదీ లేదు. ఎవరి పనుల్తో వాళ్లకు సరదా తీరిపోతుంది కాబట్టి.. సహజంగానే మరొకరి గురించి పట్టించుకునేంత తీరిక, ఓపిక ఉండదు. ఇది మనం సిగ్గు పడాల్సిన విషయమో, బాధపడాల్సిన విషయమో కచ్చితంగా కాదు. ప్రపంచం అంతా ఇలాగే ఉంది. అన్ని ఊర్లు ఒకేలాగ ఉన్నాయ్. మనదీ ఆ టానులో ముక్కే, మనమూ అందర్లాంటి వాళ్లమే అనుకుంటే గొడవే లేదు. కానీ మనం "అంతకు మించి" అనుకుంటే మాత్రం కొన్ని ఇన్విస్టిమెంట్లు(డబ్బే కాదు ఎమోషన్స్ కూడా), కొన్ని త్యాగాలు తప్పవు.

(ఇది మనకేం కావాలి, మనమేం చేయగలం అనే దాని మీద నాకున్న అవగాహన మాత్రమే. దీన్ని చదివి వదిలేయకుండా మీ అభిప్రాయాలు, ఆలోచనల్ని కామెంట్ల రూపంలో చెప్పండి...థ్యాంక్యూ..)

- అశోక్ పొడపాటి
తేదీ :- 5-9-2015
Share this article :

+ comments + 15 comments

September 5, 2015 at 2:33 AM

Hi Ashok, Good Post, i am ready to Support for any cause for our village.
Better to open an account and make some contributions who ever are interested then discuss which one is important to do it first.

Don't hesitate to drop me mail/message.

Sita

September 5, 2015 at 11:30 AM

thank u sita karumudi. first of all thanks for ur concern&support. as early as possible we will discuss, and open an account..

September 5, 2015 at 8:48 PM

good one and thanks for this....am also ready for anything............

September 6, 2015 at 7:44 AM

Am also ready for this......

September 6, 2015 at 7:45 AM

Am also ready for this......

September 6, 2015 at 6:10 PM

Good one Ashok...chalaaaa rojulaiendi....URU gurinchi mana gurinchi bgaaa pettav....mndu nvvantlu first step manam veddam....I am ready to that program...

September 7, 2015 at 9:02 AM

Thank you Anna, pandu&Vishnu. Definatly we can do something.

September 9, 2015 at 5:04 PM

Hey Ashok,

Good to see you took initiative for this. We had the same situation around 6 years back creating an account and transferring amount for our village development. but due our Igo's or what ever people call, that's got completely discontinued. I don't want that to be happen again. i am not criticizing any one here, i am telling the truth which was happened. my humble suggestion would be, anything regards to village, please don't take that as personal.
I am always be ready to participate anything which really helps to our village, not only village for people also.

Concern : This has to be continued for a long run, i don't want to see this is going to drop / people is going to drop from this due to igo's or what ever the reason.

Please excuse me if my statement hearts any one.

All the Best GMP.

September 10, 2015 at 12:10 PM

ముందుగా స్పందించినందుకు థ్యాంక్స్ అన్న. మంచైనా, చెడైనా గతంలో జరిగింది ఓ ఎక్స్ పీరియన్స్. ఈ సారి ఆ పొరపాట్లు జరకుండా చూసుకుందాం. ఏం చేయలమో, ఏం చేయలేమో.. ఏది అవసరమో, ఏది అత్యవసరమో అందరం చర్చించుకుని ముందుకెళ్ధాం.

September 10, 2015 at 6:33 PM

Munduga Sita akka ki.. Pandu thammudiki,vishnuki ,,Maa mady(Madhu) anna ki last but not least maaa middula manaki Maa Vamsi maamki ... Naa wishes.. Urgent ga Facebook messenger group evaraina okaru I mean watsup aina parledu created chesi andarni add cheyddam apudu livelo matladukundaam... Andarikosam manam mana kosam andaru

September 18, 2015 at 7:58 AM

Hello All,

I created a whatsapp group, and added people who are there in my contact. please feel free to add others whome i missed.

September 18, 2015 at 8:00 AM

Nice initiative and good article Ashok. I'm always ready to contribute whatever I can from my end to our village. We'll keep this discussion continue and see how it goes with majority of decisions!

September 18, 2015 at 11:08 PM

Tq Anna.. Discuss chesi decision theesukundam

September 29, 2015 at 8:09 PM

Vamsi, here is my number: 00353861258699, add me in Whats app group pls

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved