పొడపాటి శేషయ్య(తాత) కన్నుమూత


మన గ్రామానికి చెందిన పొడపాటి శేషయ్య ఈ ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు దాదాపు తొంభై సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వయోసంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. పొడపాటి రామయ్య సంతానంలో మిగిలి ఉన్న ఏకైన వ్యక్తి పొడపాటి శేషయ్య. ఆయన మరణంతో ఆ తరం పూర్తిగా అంతరించిపోయినట్లయింది. నిండు జీవితాన్ని గడిపి.. కొడుకుల, మనవళ్ల వృద్ధిని కళ్లారా చూసి.. మునివళ్లను ఎత్తుకొన్న అదృష్టవంతుడు శేషయ్య తాత. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాం. ఆయన మృతికి మనగుడిమెళ్లపాడు.కామ్ తరఫున నివాళులర్పిస్తున్నాం.

ముగిసిన అంత్యక్రియలు..
ఈ రోజు వేకువజామున మరణించిన పొడపాటి శేషయ్య తాత అంత్యక్రియలు దాయాదులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య సాయంత్రం జరిగాయి. ఊరి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

- అశోక్ పొడపాటి
తేదీ:- 25-5-2014
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved