మనూర్లో విరిసిన విద్యా కుసుమం


ఇటీవల విడుదలైన ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మన గ్రామానికి చెందిన పొడపాటి వైష్ణవి 458/470 మార్కులు సాధించింది. వైష్ణవి విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ విభాగంలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. తను పదో తరగతి పరీక్షల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించింది. దానికి గుర్తింపుగా ఈ ఏడాది జనవరిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో.. ఓ జ్ఞాపికను కూడా బహూకరించాం. తను ఇదే స్ఫూర్తిని కొనసాగించి, భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి రావాలని మనసారా కోరుకుంటున్నాం. అన్నట్లు వైష్ణవి అంటే చాలా మంది తెలియకపోవచ్చేమో.. తను పొడపాటి లక్ష్మయ్య, రమ దంపతుల పెద్ద కుమార్తె. అలాగే మండవ లీనత్ తదితరులు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.


- పొడపాటి అశోక్
తేదీ:- 2-5-2014
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved