మన ఊరు... ప్రస్తుత తీరు-1

నిన్నలా నేడు లేదు..
నేడులా రేపు ఉండబోదు..
కాలం మాయమరాఠి....అన్నాడో కవి.
నిజంగానే కాలం మాయమరాఠి. కళ్లు మూసి తెరిచే లోపు ఎన్ని మాయలు.. ఎన్ని మార్పులు.
క్యాలెండర్ లో మారే రోజుతో పాటే చాలా మారతాయి.
ఇక ఆ క్యాలెండర్ తో పాటైతే ఎన్నో మార్పులు.. మరెన్నో చేర్పులు.

ముఖ్యంగా మన ఊరు.. 
గత ఐదారేళ్ల నుంచి ఎన్నో మార్పులకు గురైంది.
ఊరి ముఖచిత్రంలో దాదాపు యాభై ఏళ్లుగా కనిపించని మార్పు.. ఐదేళ్ల కాలంలో కనిపించింది.
ఇప్పుడు ఊర్లో పాతకాలం నాటి ఇల్లు చాలా తక్కువ. కొత్తగా కట్టిన, కడుతున్న ఇళ్ల సంఖ్యే ఎక్కువ.
వచ్చే ఐదారు ఏళ్లలో ఊరంతా కొత్త ఇళ్లతో కళకళలాడుతున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
రియల్ ఎస్టేట్ భూమ్, సాఫ్ట్ వేర్ జాబ్ లు, కలిసొచ్చిన వ్యాపారాలతో మన జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.
ఇదంతా అభివృద్దే.. మనం గర్వపడాల్సిన స్థితే..

కానీ...
ఓ పక్క నుంచి ఊరు ఖాళీ అవుతుండటం మనం బొత్తిగా జీర్ణించుకోలేని విషయం.
ఒకప్పుడు ఐదేళ్లకు పదేళ్లకు ఎవరో ఒకరు ఊరొదిలి వెళ్లిపోయేవారు.
ఇప్పుడు కనీసం ఏడాదికి ఒకరు చొప్పున వెళ్లిపోతున్నారు.
కొత్తగా వచ్చి ఊరిలో స్థిరపడేవారు దాదాపుగా ఎవరూ లేరు. కారణాలు ఏవైనా ఊరు బోసిపోతుంది.
రాజభవనాలు కొలువుతీరిన వీధుల కన్నా.. జనంతో కిటకిటలాడే వీధులుండటమే ఊరికి కళ...

కాసేపు ఈ విశ్లేషణల్ని పక్కన పెట్టి విషయంలోకి వద్దాం. 
ఊరిలోని ఇన్ని మార్పుల్ని ఎంతమంది గమనించారు?
మనలో చాలా మంది ఊరికి రావడమే తక్కువ. వచ్చినా రెండుమూడు రోజులే.
అప్పుడు కూడా ఎవరిపనుల్లో వాళ్లు బిజీ.
ఇక ఊరంతా తిరిగే తీరిక ఎవరికుంది. అసలు ఊళ్లో ఉంటూ వీటిని గమనించే వారు ఎంతమంది?

అందుకే ఈ పోస్ట్. 
మూడు భాగాల ఈ ఆర్టికల్లో ఇది మొదటి భాగం.
దీనిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇళ్లను మీరు చూస్తారు.
రెండో పోస్ట్ లో కొత్త ఇల్లు.. వాటి వివరాలు
ఇక మూడో పోస్ట్ లో ఆలయాలు, మరికొన్ని తాజా సంగతులు మీ ముందుంచుతాం.
ఈ మార్పులు మంచివా, చెడ్డవా.. దీని పర్యావసానాలు ఏంటి అనేది కచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్. వీలైనంత త్వరలోనే దీని గురించి చర్చించుకుందాం.

ప్రస్తుతానికైతే మీరు ఈ ఫొటోలు చూడండి.. 
ఈ సారి వచ్చినప్పుడు మాత్రం.. వాస్తవాన్ని చూడటం మర్చిపోవద్దు.
చూశారుగా.. ప్రస్తుతం ఇలా ఉంది మన ఊరి పరిస్థితి.
రెండో భాగాన్ని కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను.
ఈ ఆర్టికల్ లో ఇంటిపేర్లు, ఇతర వివరాలు ఏవైనా తప్పుగా ఉంటే నాకు చెప్పండి.
వెంటనే మారుస్తాను.

- అశోక్ పొడపాటి
 ఫొటోలు: కారుమూడి చక్రితో కలిసి..
తేదీ:- 25-5-2014
Share this article :

+ comments + 4 comments

Mee urlo ekkuva mandi podapati vaaraa... Leka meeru ekkuva valla meeda concentrate chesaraa.. Nijamgane doubt vachi adugutunnaa.. Don't misunderstand me please.

May 27, 2014 at 10:19 AM

ఎక్కువ మంది పొడపాటి వారే.. థాంక్యూ

July 2, 2014 at 5:55 AM

Great job. Nenu ongolu eppuduu chudaledu. Asalu aa vypu kuda raledu. Mee blog reguar ga chaduvuthuntaanu. And maa vooriki corelate chesukuntaanu. Ye uraina paristhithi anthe, perlu theda! Again, thank you. Andunaa tappulu leni swatchamaina, manasuki hattukune telugu lo!

July 2, 2014 at 1:27 PM

thanks for ur feedback sridevi garu

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved