ఈ ప్రశ్నలకు బదులేదీ?


ఆ రోజు ఆదివారం. న్యూస్ ఫ్లో పెద్దగా ఉండదు. ఆఫీస్ లో కొలిగ్స్ అందరూ కబుర్లలో పడిపోయారు. నేను ఎప్పటిలాగే నెట్ ఓపెన్ చేసి మన ఊరి సైట్ చూస్తున్నాను. రాష్ట్రమంతా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయ్ కదా.. మనూర్లో గతంలో జరిగిన ఎన్నికల గురించి ఓ ఆర్టికల్ రాసి టాప్ స్టోరీగా పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందా.. ? అని ఆలోచిస్తున్నాను.

మరి గతంలో మనూళ్లో జరిగిన ఎన్నికల సమయంలో.. వర్గాలు, పోరాటాలు, ర్యాలీలు, పల్లెకు కాపలాలు, జాగారాలు, మందు బాటిళ్లు, ఓడిపోయినోళ్ల ఏడుపులు, గెలిచినోళ్ల ర్యాలీలు, చిందులు, ఆ వేడిలో వచ్చిన వినాయకచవితికి వేసిన రెండు పందిళ్లు,  అవసరం లేకున్నా పట్టుచీరలు, నగలతో ఆడవాళ్లు చేసిన ర్యాలీలు (అంటే ఇది బలప్రదర్శన లాంటిది. ముక్తినూతలపాడు నుంచి కూడా మహాభక్తులు వచ్చేవాళ్లు), మండపంలో మోగిపోయిన మైకులు, పోటీ పడి చేసిన అలంకరణలు, పెద్ద ఎత్తున పంచిన ప్రసాదాలు, ఊరేగింపులు... అబ్బో చాలా ఉంది. ఇది ఎక్కడ మొదలు పెట్టి.. ఎక్కడ ముగించాలో అర్థం కాలేదు. పైగా ఎలా రాసినా కొందరు నొచ్చుకుంటారు. అప్పుడు ఎలా ప్రవర్తించామా అని గుర్తొచ్చి.. కొందరు బాధపడతారు. దీని కోసం ఇంత కష్టపడటం ఎందుకులే అనిపించింది. మానిన గాయాన్ని మళ్లీ కెలగడం అవసరమా... రాయకపోతే ఎవడు అడిగాడు...? అని నాలో నేను తర్కించుకుంటున్న సమయంలో.....

మాతో పాటే పనిచేసే ఓ పెద్దాయన వచ్చి వెనక కూర్చున్నాడు. వెబ్ సైట్ నే పరీక్షగా చూస్తున్నాడు.
నేనది గమనించి.. మా ఊరి సైట్ సార్. అంటే బ్లాగు.. మీకు ఇంతకు ముందే చెప్పానుగదా..... అన్నాను. ఆయనంటే ఉన్న గౌరవం, భయంతో కంగారుగా...
'ముఖ్య కథనం' అనే లేబుల్ కింద ఉన్న హెడ్డింగులను చూస్తున్నాడు.
నీ పేరే ఎక్కువగా కనిపిస్తుంది... అన్నాడు.
అవును సార్. నాకు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ కదా.. అందుకని నేనే రాస్తుంటాను అన్నాను.
ఇందులో క్రియేటివీటీ ఏముంది. ఇది ఎవడైనా రాస్తాడు. జరిగిన విషయాల్ని ఫస్ట్ పర్సన్లో రాయడం క్రియేటివిటీనా.. నాకలా అనిపించడం లేదే. నువ్వెక్కువ ఖాళీగా ఉంటున్నావ్ అనిపిస్తుంది. రూమ్ లో పనేం ఉండదా... అన్నాడు.

ఏమనాలో తెలియక అదోరకంగా తలూపాను.

ఇక అక్కడి నుంచి మా సంభాషణ ఇలా సాగింది.
మీ ఊరికి ఏదైనా ప్రత్యేకత ఉంద. అంటే కొండలు, నదుల మధ్య ఉండటం. ఊరంతా ఒకే మాట మీద ఉండటం, ఎన్నికలన్నవి లేకపోవడం. పెదరాయుడు సినిమాలోలా ఓ పెద్దమనిషి తీర్పు చెప్పడం....ఇలాంటివి?
ఇలాంటివి ఏవీ లేవండి.

మీ ఊర్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా ఉన్నారా..?
అబ్బే లేరండి..

పోనీ సంఘ సంస్కర్తల్లాంటోళ్లు..?
అలాంటోళ్లు ఎవరూ లేరండి.

ఇంకెవరైనా ఉద్యమ నాయకులు, రాజకీయ ప్రముఖులు....?
లేరండి.

కవులూ, కళాకారులూ, రచయితలూ...?
'........'

కనీసం వీరప్పన్ లాంటోళ్లయినా ఉన్నారా...?
లేరు.

ఏదైనా ఒక మూమెంట్ బలంగా జరిగిందా.మద్య పాన నిషేధం, వరకట్న నిషేధం లాంటివి?
ఊహు.

పోనీ... మీ ఊరికి ఏదైనా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉందా. లైక్ శిలలు, శాసనాలు, వందల ఏళ్ల నాటి చెట్లు,  పురాతన ఆలయాలు.. ఇలాంటివి.?

ప్చ్

ఇవన్నీ వదిలెయ్ వయ్యా... కనీసం ఎవరైనా ఆర్మీలో ఉన్నారా...?
లేరు.

దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టుల్లో, కేదార్ నాథ్ వరదల్లో ఎవరైనా..?

అబ్బే అలాంటిదేం లేవండి. ఆల్ ఆర్ హ్యాపీ.

కనీసం గడ్డాలు, మీసాలు, గోళ్లు పెంచుకుని గిన్నీస్ బుక్ లో ఎక్కిన వాళ్లు ఎవరైనా ఉన్నారా..
'.....'

సరేనయ్యా... కనీసం చావబోయే ముందు కళ్లు దానం చేసినోళ్లుగానీ, ఓ యాభైసార్లు రక్తదానం చేసినోళ్లుగానీ, సంపాదనలో పదోవంతు.. కనీసం ఒకటో వంతు సొసైటీకి ఇచ్చే వాళ్లుగానీ....?
అస్సలు లేరు.

ఊరంతా మద్యాన్ని బంద్ చేసిన సంఘటనలేమైనా ఉన్నాయా?
అమ్మో.. అలా చేసి బతకలేరండీ..

ఆదర్శ వివాహాలేమైనా జరిగియా..?
అంటే ఏంటండి..?

అదేనయ్యా వికలాంగుల్ని, హెచ్ఐవీ లాంటి రోగాలతో బాధపడుతున్న వాళ్లనిగానీ పెళ్లి చేసుకున్నోళ్లు..
అలాంటి త్యాగాలు ఏవీ లేవండీ...

పోనీ... జీరో క్రైమ్ రేటా...?
కాదు.

అన్నింటికీ లేదు.. కాదు. ఇవి తప్పితే ఇంకో సమాధానమేదైనా చెప్పావా. మీ ఊరికి ఏదైనా ప్రత్యేకత ఉంటే.. దాన్ని ప్రచారం చేసుకోవడానికి వెబ్ సైట్ కావాలి.. అంతేగానీ వెబ్ సైటే ప్రత్యేకత కాకూడదు. ఒక ఊరి గురించి మరో ఊరోడు తెలుసుకోవాలంటే... దానిలో స్పెషల్ ఏదైనా ఉండాలి కదా. ఇవన్నీ కాదుగానీ..అసలు మీ ఊరి వెబ్ సైట్ ఎవడైనా ఎందుకు చూడాలి.. నాకు చెప్పు ముందు. 

చాలా సేపటి తర్వాత నాకు ఆయన దొరికిపోయినట్టు అనిపించింది. గతంలోనే నేను రాసిన 'ఈ వెబ్ సైట్ ఎందుకంటే' అనే ఆర్టికల్ ను ఆయనకు చెప్పి... కళ్లు తెరిపిద్దామనుకున్నాను. అంతలోనే నాకు గుర్తొచ్చింది.... ఆయన అడిగింది.. పొరుగూరోళ్లు ఎందుకు చూడాలని....?. సో ఆ ఆన్సర్ సరిపోదు. సరికాదు. అయినా మనం వెబ్ సైట్ పెట్టుకుంది... మనకోసమేగానీ.. పొరుగూరోళ్ల కోసం కాదు కదా....?. ఈ థాట్ రాగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది.

ఈ సైట్ మా కోసమే.. పొరుగూరోళ్ల కోసం కాదు అన్నాను...

మీ కోసం అంటే....
అంటే మా ఊరిలో ఉన్నవాళ్లు, బయటకు వెళ్లిపోయిన వాళ్లు, ఊరితో బంధుత్వం ఉన్న వాళ్లు, ఊరి గురించి తెలిసిన వాళ్లు.... వీళ్ల కోసం అన్నమాట.

మరి వీళ్లంతా చూస్తున్నారా..?
ఆ... చూస్తున్నారు.

ఎలా చెబుతున్నావ్...?
చూస్తున్నామని వాళ్లే చెప్పారు...

మీరు అడిగారా... వాళ్లు చెప్పారా..?
అంటే కొంతమంది మాకు చెప్పారు. చాలా మందిని మేం అడిగాం.

మరి.. మీ సైట్ సక్సె స్సేనా..?
బ్రహ్మాండంగా.. రోజుకుకి వందకి తగ్గకుండా వ్యూస్ వస్తున్నాయ్. అలెక్సాలో మంచి ర్యాంకుంది.

అంటే సక్సెస్ కి అలెక్సా ర్యాంకింగే కొలమానమా...?. అయినా ఈ సైట్ కూడలి, సంకలిని, హారం, పూదండ... వీటికి అటాచ్ అయ్యుంది కాబట్టి.. సహజంగానే వ్యూస్ వస్తాయ్.. మీ వాళ్లు చూడటం వల్లే ర్యాంక్ వచ్చిందని ఎలా చెప్పగలవ్..?
 కాదని మీరెలా చెప్పగలరు...?

నీ పేరు, మధు, పీఎస్, ఒక దానికి వెంకట్ పేర్లు మాత్రమే ఉన్నాయ్. ఇంకెవ్వరు దీనికి ఏమీ రాసినట్లు లేదు.
అభిమానం ఉన్న వాళ్లందరూ రాయాలని లేదుగదా...

కరెక్టే. కానీ మీ అందరికీ తెలిసిన చింతచెట్టు, సంక్రాంతి, వరదలు.. ఇలాంటి వాటి గురించి రాసినప్పుడు.. నిజంగా మీ ఊరి వాళ్లు దీన్ని చూస్తే ఔననో, కాదనో, అయ్యో అనో కామెంట్ చెయ్యాలి కదా. మంచో చెడో ముందు స్పందించాలి కదా. మాట్లాడుకోవాలి కదా. ఓ పెద్ద ఆర్టికల్ రాయడానికి టైమ్, ఫీల్, మూడ్.. అన్నీ కావాలిగానీ.. కామెంట్ కు అవసరం లేదనకుంటా.
అంటే అందరికీ పెద్ద జాబ్స్. బిజీగా ఉంటారు.
ప్రధాన మంత్రి, రాష్ట్రపతులు కూడా ట్విట్ చేస్తున్నారు. మీ వాళ్లు అంతకన్నా బిజీనా......?
కాదనుకోండి....

అసలు నాకో డౌటు. మీ ఊళ్లో కుర్రోళ్లంతా గొడ్లు కాసుకుంటుంటారా..?
లేదండి. ఆల్ మోస్ట్ ఆల్ అందరూ గ్రాడ్యుయేట్స్. వారిలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్. అయినా మీకా డౌటు ఎందుకొచ్చింది.
నాకే కాదు. ఈ సైట్ చూసిన ఎవరికైనా ఈ అనుమానం వస్తుంది. గతంలో మీరో సారి ఆర్టికల్స్ రాసి పంపండి అని ప్రాథేయపడ్డట్టున్నారు.. ఎవరూ పంపకపోతేనూ.... ఒకవేళ చదువురాదేమో... కంప్యూటర్ తెలియదేమోనని..!
కంప్యూటర్, నెట్ ఉండి, చదువొచ్చి.. ఓ కామెంట్ కూడా ఎందుకు చేయలేదంటావ్. 
ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమన్నా ఉన్నాయా...?
అలాంటివేం లేవండి.

ప్రొఫైల్స్ బావున్నాయ్...
థ్యాంక్సండీ. పీఎస్ అని.. ఈ సైట్ కి వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ డిజైన్ చేశాడు.

అవును ఇవీ మీరు పెట్టారా... వాళ్లు పంపారా?
అంటే కొన్నిమేము పెట్టాం... మరి కొన్ని వాళ్లు పంపారు..?
ఇప్పుడు నిజం చెప్పు.
అన్నీ మేమే పెట్టాం. ఒకటీ, అరా పంపారు.

అడుక్కున్నా పట్టించుకోలేదన్న మాట... బావుంది.

ఆఖరికి పుట్టిన రోజులు పెట్టుకోవడానికి, నీ కథలు పోస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందన్న మాట. ఆ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా ఎవడూ చెబుతున్నట్లు లేదు. 
మీ ఇద్దరు ముగ్గురే ఆర్టికల్స్ రాసుకుని.. మళ్లీ మీరే కామెంట్లు కొట్టుకుని...ఆ...
ఇంతోటి దానికి ఓ లోగో. స్లైడ్ షో...
అసలు ఒక ఊరి వాళ్లంతా కలిసి పెట్టుకున్న ఏ ఓపెన్ ఫోరమైనా.. రచ్చబండలా ఉండాలి. అందరూ మాట్లాడాలి. అందరూ వినాలి. మీది రేటింగ్స్ లేని దిక్కుమాలిన న్యూస్ చానల్ లా ఉంది. 
ఎత్తేసే బ్యాంక్ ముందు సెక్యూరిటీ గార్డుల్లా మీరు.....
ఐ డోంట్ లైక్ ఇట్. టోటల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫెయిల్యూర్. ఇంకా దీన్ని మెయిన్ టెయిన్ చేయడం ఎందుకు.. శుబ్బరంగా మూసేయండి. 

అలా ఎలా మూసేస్తామండి. చాలా కష్టపడి డిజైన్ చేసి, మేం ప్రిస్టేజియస్ గా ఫీలవుతుంటే.
ప్రతి తల్లి నవమాసాలు మోస్తుంది. ఒక్కోసారి చనిపోయిన బిడ్డలు పుడతారు. ప్రేమున్నా తప్పదు.. పూడ్చేయాల్సిందే. మీ ఎఫర్టూ అంతే. మీ సైట్ ఎందుకు దండగో.. నేను వంద కారణాలు చెప్పాలో... ఎందుకు కాదో నువ్వు ఒక్క కారణం చెప్పు.. చాలు.

నేను దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటే మళ్లీ ఆయనే...
అంత తొందరేం లేదు. బాగా ఆలోచించుకుని.. రెండు రోజుల్లో చెప్పు.... 
ఒక్క కారణం చాలు... అంటూ వెళ్లారు.

తుఫాను వెలిసినట్లుంది.. నాకు.
ఇంతకీ ఆయనకేం చెప్పాలి.
                                                              ఏం చెప్పాలి..?

                                                                                                                             అశోక్ పొడపాటి
                                                                                                                        తేదీ: 21-07-2013

Share this article :

+ comments + 4 comments

July 21, 2013 at 2:16 PM

Nice Ashok.... I got your point....tell me one thing, is it true conversation or your thoughts and questions you put in this article.... ? but any way its very good conversation... will discuss this part once we all meet. even i got the idea once i read this article.

July 21, 2013 at 6:55 PM

అంతా కల్పన కాదు.
అలా అని అంతా వాస్తవం కాదు.
సంభాషణ చిన్నదే.
కానీ విషయం మాత్రం ఇదే.

June 11, 2014 at 3:22 PM

Hi Ashok,

Eee post nenu inthavaraku chudaledu, chusi vunte eppudo reply ichedaanini.

Nenu matram ee site chusi and mana vooriki sambandhinchina posts/photos chusi chala happyga feel avuthu vuntaanu roju.

Naa chinnappudu rojulu gurthuchesukuntu vuntaanu and voorilo andharitho naa anubandham gurthu chesukuntu vuntaanu.

Ee madhya site lo vachina mana voori mukha chitralu chusi kuda happy feel ayyanu, memu eppudo one year ki okasaari India vasthamu and inka vooriki vachi oka 5 hrs vuntaamu, voorilo evaru ela vunnaru anna vishayam kuda sariga telidu appudappudu maa ammaa and nanna valla chepthunna kuda.

Nenu June 20 ki India vasthunnanu, kudirithe andarini okasaari kalusthanu, mana vooriki kuda edanna developement chesukunte baavuntundi anukuntunna.

Naa chinnappati nundi mana ooriki inka oka road kuda ledu, evarikanna aarogyam baaga lekapothe oka hospital kuda ledu, enda kalam vasthe water ki karuvu.

Kalisi napudu, nenu kuda naa chinna nati smruthulu gurthu chesukuntaanu.

Sita Karumudi

June 11, 2014 at 3:45 PM

sita karumudi...
thanks for ur response..
we will defnitly do something for our village...

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved