కొత్త రాజధాని... ఒంగోలు


రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన సంకేతాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడా చిన్నగొడవలు, నిరసనలు చెలరేగినా... కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చు. మనందరిలో సమైక్య రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉన్నా.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కచ్చితంగా గౌరవించాల్సిందే. తీవ్రతను ఒప్పుకోని తీరాల్సిందే.
         ఇక ఆంధ్ర రాజధానిపై చర్చలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లానే రాజధాని అంటూ కొన్ని న్యూస్ ఛానళ్లు హోరెత్తిస్తున్నాయి. దీనిపై ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ రోజు ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది. ఒంగోలును రాజధాని చేయడానికి ఉన్న సానుకూలతలను సమగ్రంగా వివరించింది. మన ఊరు ఇటీవలే ఒంగోలు నగరంలో కలిసింది. కార్పొరేషన్లో భాగమైంది. సో... ఇది కచ్చితంగా ఇది మనకు ఆనందకరమైన వార్తే. ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రకాశం లాంటి వెనుకబడిన జిల్లాను రాజధానిగా అందరూ ఆమోదిస్తారా...? అన్న సందిగ్ధం ఉన్నా... ఇంత కన్నా అనువైన ప్రాంతం లేదని ఎక్కువశాతం నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
      అంచనాలు నిజమై... ఒంగోలు రాజధానైతే... సొంతూరికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటూ అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదేమో. ఊరు పక్కనే అసెంబ్లీ, ఇంటి చుట్టూ ఐటీ కంపెనీలు వెలుస్తాయేమో. మనూరికి సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయేమో. వరదల బెడద ఇక ఉండదేమో. రెండు కిలోమీటర్లు నడిచెల్లి బస్సు ఎక్కాల్సిన దుస్థుతి తప్పుతుందేమో. ... ఇవన్నీ ఆశలు.

                                              ఇంకా తెలంగాణ ఏర్పడలేదు.
                                        ఒంగోలు రాజధాని అని ప్రకటించలేదు,
                                అప్పుడే ఇవన్నీ అవసరమా అని తమరు అడగొచ్చు.

                                 అవకాశం ఉన్నప్పుడు ఆశపడటంలో తప్పలేదు.       

                                                                                                                                      అశోక్ పొడపాటి
                                                                                                                                        (2-7-2013)




Share this article :

+ comments + 1 comments

Anonymous
July 3, 2013 at 8:15 AM

Please we don't want our town to be capital..
We don't want another Hyderabad here....

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved