చింత కాయ మొగుడు కాకరకాయ పెళ్ళాం

     దీనికి కూడా నేను "మన" అని కలపకుండా ఉండలేను, రాయలేను, కాబట్టి, కలిపితే "మన చింత చెట్టు" మన ఊరికి తొలిమెట్టు. అందరం ఎన్నో సార్లు అడుగుపెట్టినవాల్లమే. కాని అది ఎప్పుడూ భారం అనుకోకుండా బాధ్యత లా అందరికి హాయ్ బాయ్ చెప్తూ అక్కడే కావాల్సిన వాళ్ళకి దగ్గరగా, దగ్గరికి వచ్చిన వాళ్లకి నీడలా, కాలక్షేపానికి తోడులా ఉంటుంది. పాపం దీనికి తగిలిన దెబ్బలు కూడా ఎన్నో....
 గుర్తుందో లేదో మనం చిన్నప్పుడు రాళ్ళతో, కర్రలతో పాటు చెట్టుపైకి బాణాలు కూడా వేసేవాళ్ళం.  ఇక నేను రాసే నాలుగు లైన్స్ కి హెడ్డింగ్
 " చింత కాయ మొగుడు కాకరకాయ పెళ్ళాం." 

మేటర్ లోకి వెళ్తే ఒకటేమో చేదు మరొకటి పులుపు ఏమైనా సంబంధం ఉందా? ........ ఉంది. 

దీ..... మ్మా.. జీవితం చెరువు కట్ట దగ్గర నుండి సెంటర్ వరకు, అక్కయ్య పెద్దనాన్న వాళ్ళ కొస్టం దగ్గరనుండి చెరువు కట్ట వరకు కాకరకాయ కూర కానీ ఫ్రై కాని చేయలనుకున్నారంటే చాలు నా చెవిలో ఒక పాట వినిపించెది. (చెట్టులెక్కగలవా ఓహ్ పరిశుద్ధా పుట్టలెక్కగలవా....)  అని.  అప్పుడు ఆ పక్క నేనే పిల్లాడ్ని. మరి, చెట్టు ఎక్కాల్సిందే.

వెంటనే పరిశుద్ధా ....  అని శేశాయి అత్త 
ఇంక నేను ప్రాక్టికల్ గా రెడీ.  
చెట్టు దగ్గరికి వెళ్ళా .........  అదేంటో గుడి మెట్లు లా ఆ చెట్టు మొదట్లో ఎక్కడానికి వీలుగా స్టెప్స్ ఉన్నట్లు వుండేది. 
సరదాగా అనిపించింది, చక చక ఎక్కేసా,  పై వరకు ఎక్కేసా... అందకపోయినా ఆ కొమ్మల మీద పడుకొని మరి కష్టపడి కొన్ని కొమ్మలు తెంపాను.  ఇంక కిందకు దిగుదామని చుస్తే, నా  స్వామీ రంగా ఎక్కేటప్పుడు కనిపించిన స్టెప్స్ దిగేటప్పుడు   కనిపించలేదు. ఎలా దిగాలో తెలియడం లేదు, ధైర్యం చేద్దామంటే కాళ్ళు సరిగా అందవు. 
బయం వేసింది ఇంకెప్పుడు చెట్టు ఎక్కకూడదు అనిపించింది. ఇంక అక్కడే కూర్చున్న. కొంచెంసేపు తర్వాత మాధవ అన్నాయి అటుగా వస్తుంటే చూసి పిలిచాను. సీను కట్ చేస్తే తర్వాత రోజు కాకరకాయ ఫ్రై రెడీ. 

ఆ తర్వాత కూడా ఎవరో ఒకరు అడుగుతానే వుండేవారు నేను కోసిచ్చేవాడిని. 
సుబ్బులు అత్త ఆ పక్క నుండి వచ్చి మరి అడిగేవారు. 

దేవుడు కాకరకాయి ని చింతాకుని అలా కలిపాడా అనిపించెది.  ఒకటి చేదు మరొకటి పులుపు అయిన అవి కలిస్తే నే మరొక తీపైన, తియ్యని కారమైనా. 

అలాగే కష్టాలు నష్టాలు ప్రతి చోట తధ్యం
అయినా కష్టపడితేనే ఏదైనా సాధ్యం... !ps

=====================================================================
ఈ చెట్టు గురించి నాకు గుర్తున్నవి, అనిపించి నవీ ఇవి. 
అలాగే మీకు గుర్తున్నవీ, అనిపించినవీ కూడా మనవాళ్లతో పంచుకోండి.
ఇది అందరికీ సంబంధించి. కనుక అందరూ పంచుకున్నప్పుడే ఇది సంపూర్ణమవుతంది.
లేకపోతే ఇది అసమగ్రం.
వీలైతే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ధన్యవాదాలతో.

పి యస్ రావు పొడపాటి

Dated: 22 June, 2013
www.managudimellapadu.com
Share this article :

+ comments + 2 comments

June 23, 2013 at 10:26 AM

nice lines

June 27, 2013 at 8:19 AM

ఆహా బలే చెప్పావ్ నీ చింత చెట్టు మొగుడు కాకరకాయ పెళ్ళాం అదిరింది బాబు ,ఒక్క సారి మాకు కూడా ఆ జ్ఞాపకాలు గుర్తు చెసుకున్నట్లు అయింది . ఇలాగె మీకు నచ్చినవి మన ఉరికి సంబంధించి నవి చక్కగా అందరు రాస్తూ ఉండండి .

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved