ఇంతకీ బాద్ షా ఎలా ఉన్నాడు..?: అశోక్ పొడపాటి

దూకుడు సినిమాతో మంచి దూకుడు మీదున్న డైరెక్టర్ శ్రీను వైట్ల, ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్, దమ్ము సినిమా అనుకున్నంత స్థాయి విజయం సాధించకపోవడంతో కసిమీదున్న ఎన్టీఆర్.... వీరి ముగ్గురి కాంబినేషన్ తో రూపొందుతున్న సినిమా కావడంతో బాద్ షా సినిమాపై అటు ఇండస్ట్ర్రీతో పాటు ఇటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జస్టీస్ చౌదరి గెటప్ లో కనిపిస్తారని, పెద్ద ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులేస్తాడన్న ప్రచారాలు ఈ సినిమాకు మరింత ఊపు తెచ్చాయి. టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కూడా ఇదే. అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమా కూడా ఇదే. మరి ఇన్ని ప్రత్యేకతలతో వచ్చిన బాద్ షా అంచనాలను అందుకున్నాడా..?

కథేంటి...?
ఓ సాధారణ యువకుడు బాద్ షాగా ఎలా ఎదిగాడు. అసలతను ఆ మాఫియాలోకి ఎందుకు వెళ్లాలనుకున్నాడు.. అనేది ప్రధాన కథాంశం. రామారావు అలియాస్ బాద్ షా(ఎన్టీఆర్) తన ఐడెంటిటీని దాచిపెట్టి విదేశాల్లో ఉన్న జానకి(కాజల్)ను ప్రేమలోకి దింపుతాడు. కానీ అప్పటికే ఆమెకు నవదీప్ తో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. ఇక హీరో అండ్ గ్యాంగ్ ఆ పెళ్లిని ఎలా చెడగొట్టారు... కథానాయకుడు మాఫియా సామ్రాజ్యాన్నిఎలా కూల్చేశాడు అనేది కథకు ముగింపు.

ఎవరెలా..?
ఎన్టీఆర్ దీనిలో మాఫియా సామ్రాజ్యానికి బాద్ షాగా, జానకిని ప్రేమలో పడేసేందుకు భగ్నప్రేమికుడిగా, వెడ్డింగ్ ప్లానర్ గా మూడు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. డైలాగ్ డెలివరీ, బాండీ లాంగ్వేజ్ లో వేరియేషన్స్ చూపించడానికి ప్రయత్నించాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. ఇక డ్యాన్సులు ఇరగదీశాడు. మేకప్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. కాస్ల్యూమ్స్ కూడా సరిగ్గా సరిపోయాయి. ఫస్ట్ హాఫ్ లో అమ్మాయిల గురించి, సెకండ్ హాఫ్ లో తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటాయి. పెద్ద ఎన్టీఆర్ పాటలకు వెసిన స్టెప్పులు అభిమానులకు విందు భోజనమే. ఇక సినిమాకి సెకండ్ హీరో కామెడీ కింగ్ బ్రహ్మానందం. తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్ తో థియేటర్ ను నవ్వుల్లో ముంచెత్తుతాడు. బ్రహ్మానందం పాత్ర ప్రవేశంతోనే సినిమాలో జోష్ పెరుగుతుంది. డ్రీమ్ చైర్ అంటూ చేసిన కామెడీ శ్రీనువైట్ల గత సినిమాలను పోలి ఉన్నా నవ్వు ఆపుకోవడం మాత్రం సాధ్యం కాదు. నాజర్, బ్రహ్మనందం పాత్రల మధ్య నడిచే సన్నివేశాలే సినిమాకు ప్రాణం. ఇక జానకిగా కాజల్ కూడా మెప్పిస్తుంది. బాల్ సిద్ధాంతంతో కొన్ని చోట్ల విసిగించినా ఓవరాల్ గా మెప్పిస్తుంది. చాన్నాళ్ల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. దాదాపు సినిమా అంతా కనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా ముఖేష్ రుషి, సుహాసినిలు మెప్పిస్తారు. అవినీతి పోలీస్ అధికారిగా నవదీప్ నటన ఆకట్టుకుంటుంది. అతని సీన్లు తక్కువైనా ఉన్నంతలో బాగానే చేశాడు. ఇక సిద్ధార్థది సర్ ప్రైజింగ్ గెస్ట్ రోల్. రెండు నిమిషాల పాటు ఉండే అతి చిన్న పాత్రలో కనిపిస్తాడు. నిజాయితీ పరుడైన పోలీస్ అధికారిగా షియాజీ షిండే, గిటార్ వాయిస్తూ తిరిగే డాన్ గా అశీష్ విద్యార్థి తమ పాత్రలకు న్యాయం చేశారు. నాజర్ నటన ఆకట్టుకుంటుంది. నవ్వించడానికి వెన్నెల కిషోర్ చేసిన ప్రయత్నం ఫలించ లేదు. సాధారణంగా శ్రీనువైట్ల సినిమల్లో ఒక పాత్ర ద్వారా సినిమా వాళ్లను క్రిటిసైజ్ చేస్తాడు. దీనిలో సినిమా డైరెక్టర్ గా ఎమ్మెస్ నారాయణ కామెడీ కొన్నిచోట్ల నవ్విస్తాడు. చాలాచోట్ల విసిగిస్తాడు. చంద్రమోహన్ కామెడీ పండింది. శ్రీను వైట్ల సినిమాల్లో ఒక మందు సీను కంపల్స రీ. అయితే ఆ ట్రాక్ ను ఈసారి లేడీ క్యారెక్టర్ల మీద నడిపాడు. అయితే అసభ్యతకు తావివ్వలేదనుకోండి. పాటలు కూడా సోసోగానే ఉన్నాయి. రీరికార్డింగ్ చాలా చోట్ల దూకుడు సినిమాను గుర్తుకు తెస్తుంది. కెమెరా, ఎడిటింగ్ ఓకే. నిర్మాత బండ్ల గణేష్ ఖర్చు చేసిన ప్రతి రూపాయి థియేటర్లోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

హైలెట్స్...
ఎన్టీఆర్ నటన
బ్రహ్మనందం ఎపిసోడ్
పంచ్ డైలాగ్స్
రీ రికార్డింగ్
పెద్దాయన పాటలకు ఎన్టీఆర్ వేసే స్టెప్స్

డ్రా బ్యాక్స్
మాఫియా ఎపిసోడ్ లెంగ్తీగా ఉండటం
పాటలు
రొటీన్ క్లైమాక్స్
చాలా సన్నివేశాలు శ్రీను వైట్ల గత సినిమాలను పోలి ఉండటం

చివరిగా..
బాద్ షా సినిమాలో అన్నీ ఉన్నాయి.. స్టార్ కాస్టింగ్, ఫానిన్ లొకేషన్లు, పంచ్ డైలాగులు, కామెడీ, కాస్ట్లీ కార్లలో తిరిగే డాన్లు, షూటింగ్ లు, ఫైటింగ్ లు... ఇత్యాధి సమస్తం ఉన్నా సగటు ప్రేక్షకుడు సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఫస్ట్ హాప్ ముగిసే సమయానికి ఓ ఏవరేజ్ సినిమా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాప్ ప్రారంభమవగానే ఎంటర్ అయ్యే బ్రహ్మనందం క్యారెక్టర్ తో సినిమా కళే మారిపోతుంది. థియేటర్ అంతా నవ్వులో మునిగిపోయి... సినిమాను విజయతీరానికి చేరుతుంది. శ్రీను వైట్ల మ్యాజిక్ ప్రస్తుతానికి వర్కవుట్ అయినా.. భవిష్యత్తులో బోర్ కొట్టే ప్రమాదం లేకపోలేదు.
                                                                                                                                       - అశోక్ పొడపాటి
Share this article :

+ comments + 2 comments

Anonymous
April 8, 2013 at 3:38 PM

"శ్రీను వైట్ల మ్యాజిక్ ప్రస్తుతానికి వర్కవుట్ అయినా.. భవిష్యత్తులో బోర్ కొట్టే ప్రమాదం లేకపోలేదు."

ఈఫార్ములా ఎప్పుడో బోరుకోట్టేసింది బాసూ, బోర్ అయిపోయిన సినిమాని ఫర్వాలేదు అంటున్నావ్?, ప్రస్తుతానికి వర్కవుట్ అంటున్నావ్? ఏంటి కథ ?

Anonymous
April 8, 2013 at 7:25 PM

adhi katha kadu, nijam............ nijam chepte konchem kastam gane untundi le...... review is very nice....... thanks.

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved