ఇది మన రాజ భోగ రాష్ట్రం ... ఇప్పుడు ఒకప్పుడు .మన లాంటి ఒకాయన చెప్పాడు మనము మన రాష్ట్రము గురించి ... చదవండి ఒకసారి  ఇది నిజమేగా !


ఎప్పుడో పదేళ్ళ క్రితం ఇంటింటికీ ఇంకుడు గుంతలంటే, చాదస్తం ఎక్కువైందంటూ అవే ఇంకుడు గుంతళ్ళో పాతిపెడతామన్నారు! ఇప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోయాయంటున్నారు!!


IT అని, టెలీ కమ్యూనికేషనని చెబుతుంటే హైటెక్ బాబు అని, సాధరణ జనం గోడు పట్టదని ఎద్దేవా చేసేరు! ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా తెలుగు ఇంజినీర్లే ఉన్నారు అంటున్నారు!!

హైదరాబాద్‌ని ప్రపంచ స్థాయి నగరంగా, భారత క్రీడా రాజధానిగా మలచడానికి ప్రయత్నిస్తే ఆయన CMగా ఉన్నది కేవలం హైదరాబాద్‌కేనా, మిగతా రాష్ట్రం పట్టదా అని విమర్శించారు! ఇక్కడి సదుపాయాలనుపయోగించుకుని క్రీడాకారులు పతకాలు గెలుస్తుంటే మా వాళ్ళేనంటూ చంకలు గుద్దుకుంటున్నారు!!

గ్రామ గ్రామానికి తారు రోడ్లైతే ఉన్నాయి గాని, చేళ్ళలో చుక్కనీరు లేదన్నారు! ఇప్పుడు గుంతల రోడ్లతో నడుములు విరగ్గొట్టుకుంటున్నారు!!

ఎనిమిదేళ్ళు కరువు తాండవించినా రైతులకు తొమ్మిది గంటలు, పరిశ్రమలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తుని అందించినా ఉచితాలు కావాలంటూ విమర్శించారు! ఇప్పుడు రోజుల తరబడి విద్యుత్తులేక వందలకొద్దీ పరిశ్రమలు, లక్షలకొద్దీ రైతులు అప్పుల ఊబిలో మునిగిపోతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాం!!

పట్టణానికొక ఇంజినీరింగ్ కాలేజీ పెడితే ఎవరికి కావాలి ఈ చదువులన్నారు! ఇప్పుడు ఇంటికొక సాఫ్ట్‌వేర్ ఇంజీనీరుని చూసి మురిసిపోతున్నారు!!

విజన్ 2020 అంటూ, పేదరిక నిర్మూలన అంటుంటే వెర్రివాడన్నట్లు చూసారు!! ఇప్పుడు ముందుచూపులేని ప్రభుత్వాలతో రాష్ట్రం దశాబ్దాల వెనక్కి పోతుంటే తలదించుకుంటున్నారు!!

జన్మభూమి శ్రమదానం పేర్లతో గ్రామాభివృద్దికి పాటుబడుతుంటే ప్రజల డబ్బుతో, కష్టంతో చేసేదానికి ప్రభుత్వమెందుకని ఎగతాళి చేసారు! ఇప్పుడు గ్రామాల్లో పనులు కరువై యువత వలసల బాట పడుతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోతున్నారు!! పని..పని.. అని ప్రభుత్వోద్యోగులను రాత్రి పగలు తేడా లేకుండా పరిగెత్తిస్తుంటే నియంతని, తుగ్లక్ అని అన్నారు! ఇప్పుడు అవినీతి కేసులతో మంత్రులు, అధికారులన్న తేడా లేకుండా అందరూ జైళ్ళకెళ్తుంటే నోరెళ్ళబెడుతున్నారు!!

మొన్నటికి మొన్న నగదు బదిలీ పథకమంటే జనాలని సోమరిపోతులని చేయడానికేనన్నారు! ఇప్పుడు అదే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడాన్ని హర్షిస్తున్నారు!!

ప్రపంచం మొత్తం కీర్తించిన మనిషిని వామపక్షాల పేరుతో, తెలంగాణా పేరుతో, రైతు వ్యతిరేకి పేరుతొ వామపక్ష మేధావులు, మోసపూరిత రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరు కలిసి అధికారం లేకుండా చేసారు. రాష్ట్రాన్ని రాబందులకు అప్పగించారు. గత తొమ్మిదేళ్ళలో జరిగిందేంటో మళ్ళీ బాబు రాకపొతే జరిగేదేంటో తెలిసి కూడా ఇంకా ఈ రాజకీయ క్రీడలో ఆయనని ఓడిస్తునే ఉన్నాం.

ఒకడు సామజిక న్యాయమని వచ్చాడు. ఎన్నికలలో తలపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసి హస్తంతోనే సమస్తం అంటూ పార్టీని కలిపేసి ప్రజలను వెధవలను చేసాడు. అయినా జనాలు కళ్ళు తెరవలేదు.

ఒకడు మంత్రి పదవి దక్కలేదని తెలంగాణ సెంటిమెంట్ పేరుతో తొమ్మిదేళ్ళ నుంచి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేయడంలో తనవంతు పాత్ర సమర్థంగా పోషిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఢిల్లీ ఉత్తర్వులు అందుకుంటూ రేపో మాపో ఇక తన కారును గాంధీ భవన్‌లోనే పార్క్ చేయడానికి సిద్దమవుతున్నాడు. అన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా జనం ఇంకా తెలంగాణాకి అన్యాయం చేస్తోంది బాబేనన్న భ్రమలోనే గడుపుతున్నారు.

ఇంకొకడున్నాడు.. వాడికి వాడే మేధావినని చెప్పుకొని తిరుగుతాడు. సురాజ్యమని అవినీతి రాజకీయలకు అంతం పలుకుతానని వచ్చాడు. రెండు వారాలకి ఒకసారి ఢిల్లీ అమ్మని, మౌన మునిని కలుస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా తన కర్తవ్యమేంటో తెలుసుకుంటూనే ఉన్నాడు. వాడి మాయ మాటలు యువత ఇంకా నమ్ముతూనే ఉంది.

ఇప్పుడు నేనేదో అందరినీ తెలుగుదేశానికి ఒట్లేయమని అదుగుతున్నానని అనుకునేరు. నేను ఆ పని చేయట్లేదు. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటే. రాజకీయాలంటే రొచ్చు అని, వాటి గురించి ఆలోచించడం దండగని, రాజకీయ నేతలంతా ఒక్కటేనని, ఏ పార్టీకి ఓటు వేసినా మన గతి ఇంతేనని నిర్లిప్తతతో గడిపేస్తున్న మనం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. మన రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోలెకపోతే ఇప్పటికే అందరికీ చులకనైన మనం ఇంకో ఐదేళ్ళలో అగాథంలోకి దిగిపోతాం. మనమంతా ఇక్కడి నుండి వేరే రాష్ట్రాలకు వలసపోయే దుర్భర పరిస్థితిని చవిచూస్తాం.

బాబు వస్తున్నాడు. జరుగుతున్నవన్నీ మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి వస్తున్నాడు. జనంతో మరో సారి మమేకం అవ్వడానికి 63 ఏళ్ళ వయసులో వేల కిలోమీటర్లు నడవడానికి సిద్దపడ్డాడు. ఆయన చెప్పేది విందాం. నిజానిజాలు తెల్సుకుందాం.

మన ఓటు చాలా విలువైనది. దానిని సక్రమంగా ఉపయోగించుకుందాం. మరో ఐదేళ్ళు మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టకుండా జాగ్రత్తపడదాం.

మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మళ్ళీ తెలుగు వాడి కీర్తి నలువైపులా వ్యాప్తి చెయడానికి సహకరిద్దాం. తెలుగు ఆత్మగౌరవం కాపాడుకుందాం. మన రాష్ట్రం మనమే పాలించుకుందాం. ఢిల్లీని శాసించాలే గాని యాచించే పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకుందాం.

బాబు వస్తున్నాడు. ఆయన చెప్పేది విందాం. అర్థం చేసుకుందాం. నిజాలు తెల్సుకుందాం. మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇది మనందరి బాధ్యత. ఇప్పుడు మనం కళ్ళు తెరవకపోతే ఇక రాష్ట్రం మన చేయి దాటిపోతుంది.

మన రేపటి కోసం మన వంతు సహకారం అందిద్దాం. చేజేతులా అంధకారాన్ని కొనితెచ్చుకోకుండా జాగ్రత్త పడదాం.

Share this article :

+ comments + 1 comments

April 23, 2013 at 11:03 AM

Excellent. Rupayalaki ammudu poyee janam emi chestaro .vari gunta vare thavukuntuunaru.

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved