'మేజర్' గర్జనకు 20 ఏళ్లు

మేజర్ చంద్రకాంత్ అంటే... 
వయసైపోయినంత మాత్రాన సింహం కుందేలుకాదంటూ ఓ మహానటుడు సగర్వంగా ఎగురవేసిన విజయ బావుటా.
కళామతల్లి కంఠసీమన నటసార్వభౌముడు నందమూరి తారక రాముడు  అలంకరించిన ఆఖరి వజ్రాలహారం. తెలుగుతల్లి ముద్దుబిడ్డ చిట్టచివరి విజయదరహాసం.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, కళాప్రపూర్ణ మోహన్ బాబు, రచనా ధురంధరులు పరచూరి సోదరులు ఉమ్మడిగా తమ ఆరాథ్యనటుడికి భక్తిగా అలంకరించిన మందారమాల.
'సరిలేరు... మీకెవ్వరూ' తెలుగుజాతి తన్మయత్వంతో ఆలపించిన విజయగీతిక.
మరుసటి ఏడాది వీచిన తెలుగుదేశం ప్రభంజనానికి నాందిగా నిలిచిన చిత్రరాజం.

ఈ చిత్రంలో అన్న పలికి ఆఖరి మాట....
భారత సింహానికి చావు లేదు...
అలాగే ఈ నందమూరి నట సింహానికి కూడా......

మిస్టర్ ఎంపీ... అంటూ అన్నచేసిన గర్జన మార్మోగుతున్నంత కాలం
పుణ్యభూమి నాదేశం నమోనమామి.... అన్న గీతం సుప్రభాతంలా తెలుగుజాతిని జాగృతం చేస్తున్నంత కాలం..
మేజర్ చంద్రకాంత్ కు మరణం లేదు...

పుణ్యలోకాన ఉన్న ఆ మహానటుడికి మరొక్కసారి నివాళులర్పించుకుంటూ.....

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved