ఇదిగో మన ఘన వారసత్వం


అప్పటి వరకు అట్ట ముక్కలు, చెక్క ముక్కలతో ఉన్న సెట్ ఆయన రాకతో ఆలయ పవిత్రతను సంతరించుకునేది. అప్పటి వరకు అరుపులు, కేకలతో గందరగోళంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ప్రశాంత ధ్యాన మందిరంలా మారేది. దుర్యోధనుడి రాచటీవిని, శ్రీకృష్ణుడి లాలిత్యాన్ని, అర్జునుడి శౌర్యాన్ని ఒకే ఫ్రెమ్ లో పలికించడం ఆ మహానటుడి ప్రత్యేకత. ఆ నటసార్వభౌముడు  నందమూరి తారక రామారావు కీర్తికిరీటం లో ఓ మేలిమి కలికితురాయి లవకుశ. నాటి మేటి నటులు, సాంకేతిక నిపుణులు తమ ప్రజ్ఞ్నాపాటవాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించిన దృశ్య కావ్యం అది. అన్నను క్యాలండర్ దేవుణ్ణి చేసిన సినిమా కూడా అదే. ఆ చిత్రం విడుదలై నేటికి అర్థ శతాబ్ది. ఈ సందర్భంగా ఆ మహానీయుల్ని స్మరించుకోవడం మా బాధ్యత, కర్తవ్యం.
ఈ ఎంత ప్రసిద్దో..  పాటలు అంతకన్నా ప్రసిద్ధి. ఇక మన ఉరి గుడి మీద ఈ పాటలు ఓ పదేళ్ళ పాటు మారు మోగాయి. దాదాపు అందరికి ఇవి నోటికివచ్చు. ఇప్పుడు ఈ పాటలు వింటుంటే చిన్నప్పుడు మన ఊరి గుళ్ళో జరిగిన సీతారాముల కల్యాణం గుర్తుకురావడం సహజం. ఆరోజులు మల్లి రావాలని కోరుకోవడం అంత కన్నా సహజం.
వారసత్వ సంపద అంటే, స్థలాలు, పొలాలు, ఇల్లు మాత్రమే కాదు....కూచిపూడి నాట్యాలు, హరికధలు, ఘంటసాల గానాలు, బాపురమణలు, మాయాబజార్, లవకుశ లాంటి సినిమాలు కుడా
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved