సంక్రాంతి సంబరాలు 2013

సంక్రాంతి మన పండుగ. తెలుగు పండుగ. అచ్చమైన పల్లె పండుగ. బతుకు బాటలో తలోదిక్కుకి ఎగిరిపోయిన గువ్వలన్ని తిరిగి గూటికే చేరి సందడి చేసే నిండైన పండుగ. ఆ అనుభూతులని గుండెలనిండా నింపుకుని, మరో ఏడాదికి సరిపడా జ్ఞాపకాల్ని పోగుచేసుకునే పసందైన పండుగ.  ఏడాది సంక్రాంతి మనకు అలాంటి ఎన్నో అద్బుతమైన జ్ఞాపకాల్ని మిగిల్చింది. ముఖ్యంగా పిల్లలకు పెట్టిన ఆటల పోటీలు. నిజంగా ఊహించని స్పందన. ఊర్లో ఇంత మంది పిల్లలు ఉన్నారని అప్పటికి చాలామందికి తెలియదు. రన్నింగ్, స్కిప్పింగ్, స్పూన్లింగ్, స్లో సైక్లింగ్, మ్యూజికల్ చైర్స్ తో భోగి రోజు సందడి సందడి గా ముగిసింది. ఇక పండగ పూట ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. పట్టు పావడాలు, కొత్త బట్టలతో రంగురంగుల సీతాకోక చిలకల్లా వచ్చిన పిల్లల్లో, ఎవ్వరిని నిరాస పరచకుండా అందరికీ ప్రతిభకు తగ్గ పురస్కారాల ప్రదానం. ఇక మన కుర్రోళ్ళ కుర్చీలాట, స్లో సైక్లింగ్ పండగకు మరింత వన్నె తెచ్చిన కొసమెరుపు.

ఫొటోస్ కొరకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి. సంక్రాంతి సంబరాలు
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved