ఆ ఊరు, ఆ ప్రజలు ఎక్కడ?


ఆ ఊరు, ఆ ప్రజలు ఎక్కడ- మధు కారుముడి
ఒకప్పటి మా ఊరు...నాకు బాగా నచ్చిన మా ఊరు,

ఎప్పటికి మర్చిపోలేను  అనిపించే అంతటి ఆప్యాయత


అనురాగాలు పంచిన మా ఊరు, అస్సలు రోడ్డు కూడా

లేని మా ఊరు, కల్మషం లేని మనసున్న, అన్యోన్యనంగా

పలకరించే మనోభావాలు కల్గిన ప్రజలు ఉన్న మా ఊరు ,

కలసి మెలసి ఉండే అమ్మలక్కలున్న మా ఊరు ,


కలసి పనిచేసే శ్రమను కూడా పంచుకునే ప్రజలున్న మా ఊరు ,


ఒకరికి ఒకరు సాయం చేసే మనస్తత్వం ఉన్న బాబాయిలు ,మామలు ,అన్నలు ,


పిన్నమ్మలు ,పెద్దమ్మ లు, అత్త లు, స్నేహితులు ఉన్న మా ఊరు


కష్టాలు ఏలా ఉంటాయో కూడా తెలియకుండా చిరునవ్వును ఎప్పుడు చెదరకుండా

ఉంచుకోగల అన్యోనతను పంచిన , అమ్మ , నాన్న ,నానమ్మ , తాతయ్యలు ఉన్న మా ఊరు ,

ఎప్పుడు పిల్లలు ,పెద్దలు (పేకాట )ఆట లాడుతూ కళకళ లాడే మా ఊరు ,


తిడుతూ తిట్టించుకుంటూ ఎండై నా ,వానైనా, బురదైనా లెక్క చేయ కుండా (క్రికెట్ )ఆటలకు


వచ్చే స్నేహితులున్న మా ఊరు, వానొస్తే వాగొచ్చేది , వాగొస్తే మా ఊరి చెరువుకు నీరొచ్చేది ,


మా బడి కి సెలవొచ్చేది , మాకు నీళ్ళు తెచ్చే కష్టం తగ్గేది , మా ఊరి బురద గట్ల మీద నడిచి వచ్చి మరి


మాకు పాటాలు నేర్పిన మా గురువు గారు దేవదానం గారికి నచ్చిన మా ఊరు , రాత్రి పాఠాలు శ్రద్దగా నేర్చుకున్న ప్రజలున్న మా ఊరు ,బజారు అరుగు మీద పది మంది తో కలసి కూర్చోగల్గిన మా ఊరు...


జండా స్థంబం దగ్గర సాయంత్రం కలిసి మెలిసి కూర్చో గల్గిన మా ఊరు .....


..మళ్లీ ఎప్పుడు అలా తయారవుతుంది .....నాకు మళ్లీ ఎప్పుడు నచ్చుతుంది ?
పాపం మన ఊరి కుర్రోళ్ళు  చదువుతున్న వాళ్ళు , చదువు అయిపోయీ ఉద్యోగం రాని వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయినట్లుగా
అనిపిస్తుంది. దీనెమ్మ జీవితం మన ఊరి  కెల్లాలంటేనే చిరాకు పుట్టే అంతటి అసహ్యంతో ఉన్నారు.


ఎందుకలా  ఉన్నారంటే మన ఊరిలో అరెపాపం మన వాడు అనుకునే వాడు ఒకడు  ఉంటె , ఆడుగు అడుగునా ప్రశ్నలు వేసి తాట తీసేవాళ్ళు 
పది మంది ఉన్నారు, కాదు కాదు ఊరంతా ఉన్నారబ్బ అస్సల ......
ఊరు దాటి ఉద్యోగం చేసే ప్రతి వాడు వాడికి వాడు ఎదో భారత దేశానికి "ప్రదానమంత్రి  " ఉద్యోగం
వచ్చినట్లు మారిపోతారు అదేంటో...


ఎవడి చదువు ఎంత మాత్రమో ఎవరికీ తెలియదబ్బా ఇక్కడ,


ఒకాయన అంటాడు మావాడు చిన్నప్పటి నుండి తెగ కస్టపడి చదివి అన్నీ ముందు (class first )ఉండేవాడు అంటాడు మమకారంతో, పాపం అయన మర్చి పోయాడు వాడికి 10 తరగతి లో 300 మార్కులు మాత్రమే వచ్చాయని ...


అదేంటో నబ్బ ఉద్యోగం చేసే ప్రతి వాడు వాడికి వాడు ఒక గోడ కట్టుకోటం మొదలు  పెట్టాడు.


అల అని ఊరికి ఎదో చెయ్యమని ఎవ్వరు అడగటం లేదు ,


మీ జీతం (salary) డబ్బులు అంత కన్నా ఎవరు అడగటం లేదు కదా !పాపం "ఉద్యోగం"రాని  వాళ్లకు కొద్దిగా సూచనలు చేస్తూ 
అందరితో లేకపోతే కొందరి తో నైన అప్పుడప్పుడు అన్న కలుస్తూ ఉండండి 
తప్పని సరిగా కలిసుండాలి .
మరీ ఈ మద్య కాలం లో అయితే గత 3 సంవత్సరాలుగా మన ఊరి 
పిల్లకాయలు ,కుర్రోళ్ళు హడలి పోయారనే చెప్పాలి ఘట్టిగా. ఎక్కడ బజారు కెళ్తే,


ఎక్కడ అరుగు మీద కూర్చుంటే చుట్టు ప్రక్కల ఒకటికి 10 సార్లు  కళ్ళన్నీ గిర గిరా తిప్పుతూ ఎక్కడ ఈ "అడవి జాతి "మనిషి కళ్ళలో పడతామో అని ఇప్పటికి పాపం మన ఉరి కుర్రోళ్ళు .... 


ఒక పండగ కలసి చేసుకోరు,
 అస్సల ఎప్పుడు కలిసుంటారు మన ఊరి ప్రజలు ...


ఒక ఊరేగింపు కలిసి చెయ్యరు,


అందరు మాత్రం ఎంతో ఆప్యాయత అనురాగాలుగా ఏంటో కల్సున్నట్లు మాత్రం తెగ జీవించేస్తుంటారు .
వినాయక చవితి చేసిన పిల్లకాయలను, కుర్రోళ్ళను కుడా వదిలి పెట్టని దుర్మార్గపు  ప్రజలు ఉన్న మన ఊరు.


50 రూపాయలు చందా ఇచ్చిన ఒకాయన అంటాడు డబ్బులన్నీ వీళ్ళు  వాడుకున్నారని,

పాపం రాత్రుళ్ళు నిద్రలేకుండా దోమలతో కుట్టించుకుంటూ, సొంత డబ్బులతో బండిలో పెట్రోల్
కొట్టించుకుని వానలో తడుస్తూ , బురద లో పడుతూ లేస్తూ వినాయకుడి కోసం ,రామ రామ (మన ఊరి బాగు కోసం )వొళ్ళంతా హోనం చేసుకుని నానా
నానా కష్టాలు పడి  , ఊరేగింపు చేస్తే ఆ" పిచ్చోడు " ఇచ్చిన బిరుదు అది .


ఇది మంచి కోసం అయితే చాలా చాలా బాగుండేది , కాని ఎంత సేపటికి
ఎదుటి వాడి మీద , పక్క వాడి మీద కుళ్ళు , ఈర్ష్యా....
ఎందుకో తెలియదు గాని అందరూ ఒక్కసారిగా మారిపోయారు సుమా !


బాబోయి ఎంత దారుణం గా ఉన్నారో ఇప్పుడయితే ...

ఒకరిల్లు దాటి ఒకళ్ళు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు ,
అస్సల మనస్పూర్తిగా ఉండే మాటలు నే లేవు ఇప్పుడు ...
ఒకప్పుడు ఎంత బావుండే వాళ్ళు  నో నాకు తెల్సిన మన ఊరి ప్రజలు, నాకు తెల్సి ఒక 5 సంవత్సరాల క్రితం వరకు చక్కగా పండగ అయినా 
,ఇంట్లో చేసుకునే కూర అయినా,మజ్జిగ అయినా కుడా కలసి అంత స్వతంత్రంగా తీసుకెళ్ళే వాళ్ళు , చక్కగా కలసి వంటలు(అరిసలు ,చెక్కలు ,గవ్వలు,కారప్పూస)లాంటివి  కూడా కలసి  చేసుకునే వాళ్ళు ,కాని ఇప్పుడు ఎవరికీ వాళ్ళు  చేసుకోటం కూడా మానేసారు చాలా 
మంది మరి !

మారాలని కోరుకుందాం.  అందరం కలిసుండాలి కోరుకుందాం.  
మన ఊరికి  రోడ్డు లేని రోజుల్లోనే చాలా బావుండేది. ఆ ముక్తినూతలపాడు ప్రైవేటుకి అందరం ఎంచక్కా ఆ బురద గట్ల మీదనే ఒకరి 
అడుగుల్లో ఒకళ్ళు వేసుకుంటూ, జాగ్రత్తగా దారిలో జోకులు వేసుకుంటూ,మరీ కలసి మెలసి వెల్లోచ్చే వాళ్ళం.
  ఊరికి వెళ్తే బావున్నావా అని అడిగే నలుగురు ఆప్తులు కన్నా ,ఎప్పుడు వెళ్తావ్ రా అని వెటకారంగా  అడిగే వాళ్ళు 40 మంది ప్రజలున్న మన ఊరు....


మన ఊర్లో ముఖ్యంగా రెండు  ప్రముఖ ఇంటి పేర్లు కల్గిన వాళ్ళు ఇంకా వాళ్ళలో కల్సి పోయి కలివిడిగా ఉండే మిగిలిన ఇంటి పేర్లు కల్గిన 
వాళ్ళు , వాళ్ళ లో  వాళ్ళన్న బాగా కలసి పోయి ఉండే వాళ్ళు. వీలై నంత  వరకు కల్సి పొలం పనులకు , అవి అయి పోగానే గ్రేడింగ్ కి చక్కగా ఇష్టం గా వెళ్ళే వాళ్ళు ,అందరు కలసి మెలసి ఇబ్బందులను కుడా పంచుకునే వాళ్ళు ,ఇంకా చెప్పాలంటే ఒక చిన్నపాటి పెద్ద కుటుంబం లా ఉండే వాళ్ళబ్బా ...
            అ దివ్య మంగళ స్వరూపుడైన ఆ "తారక రాముని " ఆశిస్సులతో తో ఇకనైనా చక్కగా అందరం కలసి మెలసి ఉండేలా ప్రయత్నిదాం.                     ఎల్లప్పుడూ గ్రామ అభివృద్దినే కోరుకునే                
                                                                                                                                                 
      మీ..  మధు కారుమూడి.


Share this article :

+ comments + 5 comments

October 24, 2012 at 8:18 PM

డియర్ మధు నువ్వు చెప్పింది నిజం.ఇలా మనం అనుకుంటే సరిపోతుందా?
ఒక్క సారి మన గతం మరచిపోయి మనమేదో ఎవడికి తెలియని లోకం నుంచి వచ్చాం అని తెగ ఫీల్ అవుతారు మన ఊరి జనం.ఇందులో నాకు తెలిసినప్పటి నుంచి వర్గాలున్నయ్యి.కాని ఇప్పుడు ఉన్నంత గా ఐతే కాదు.ఒకడు మన ఊరికి మంచి చేద్దాం అంటే ఇంకొకడు అది ఎలా చెదకొడదాం అని ఆలోచించే మహానుభావులు ఉన్నారు ఇప్పుడు.ఐన మారని మన ప్రజల కోసం కాదు కదా మన గ్రూప్.మన భావితరాల వాళ్లకి ఐన మనవంతు సహాయం మన నుంచి ఎల్లప్పుడూ ఉంటుంది అని వాళ్లకి మన మీద నమ్మకం కోసమే మన ఈ చిన్ని ప్రయత్నం .ఇది మన ఊరికి ఎంత ఉపయోగమో నాకు తెలియదు కాని,మన ఊరి రాబోయే తరానికి మాత్రం మన కోసం మన అన్నలు,మామయ్యలు ఉన్నారు రా అని మన ఊరి యూత్ ఎప్పటికి చెప్పుకునేలా దిన దిన ప్రవర్ధమానం లా ఎదగాలని కోరుకుంటూ....

ఎల్లప్పుడూ.....
మీ ....
వెంకట్రావు (కృష్ణ)

October 25, 2012 at 12:22 AM

చాలాబాగుంది!!!!!!!!!!!!
గ్రూప్ లో వున్నవాళ్ళు తెలుసుకోవడానికి లేని వాళ్ళు మనం తెలుసుకోలేకపోతున్నమే అని బాదపాడడానికి అలాంటి అర్టికాల్స్ వుండాలి...
ఈరోజే పుట్టిన మన గుడిమెల్లపాడు చాల ఉన్నత రేంజ్ కి వెళ్ళాలని బావి తరాలకు ఆదర్శం గ వుండాలని ఎప్పుడు ఫొటోస్ మరియు పోస్ట్ లతో కలకలలదలాలి మనసారా కోరుకుంటూ
ఓఓఓఓఓఓఓఓఓ స్టూడెంట్ ఫ్రం గుడిమెల్లపాడు

Anonymous
October 25, 2012 at 8:07 PM

మీ ఆదరణ నే మా లాంటి వాళ్ళకు ఆశిస్సులు ....ఇవి ఎప్పుడు మన managudimellapadu.com

కి ఉండాలని కోరుకుంటూ ....

మీ ..
chowdary kms.

Anonymous
October 25, 2012 at 8:14 PM

మనుషులను బాగా అర్ధం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా చెప్పగలరు ,బాగా చెప్పావ్

బావ సూపర్ బావ నువ్వు

Anonymous
October 30, 2012 at 3:51 PM

enaati maanava naijam ni baaga vivarinchavu...

idi oka vuriki maatrame parimitham kadu..o desham tho modalayyi oka intlo ni manushulu manasula madhya erpaduthunna agadhaalu..kaaranam "mamatha anuragam" ane padalaki artham marichipovatam ane anali...

"little drops of water make the mighty ocean" ane proverb laaga ..prathi okkaru paristhuthalani artham chesukuni vutti maatalatho kaakunda svachamga preminche gunam alaparuchukovatame..

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved